Begin typing your search above and press return to search.

ఏపీ బాధ అరుణ్‌ జైట్లీ కి తెలిసిందా

By:  Tupaki Desk   |   5 Aug 2015 4:51 PM GMT
ఏపీ బాధ అరుణ్‌ జైట్లీ కి తెలిసిందా
X
అత్త‌రూ.. ఆదాయం రెండూ ఓ చోట ల‌భించే సౌభాగ్య న‌గ‌రి హైద్రాబాద్‌. నిన్న‌టి దాకా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఖ‌జానాకు కొండంత అండ‌గా నిలిచిందీ న‌గ‌రం. విభ‌జ‌న అనంత‌రం రాజ‌ధాని లేక‌, హైద్రాబాద్‌లాంటి మ‌హా న‌గ‌రి నిర్మితం కాక అవ‌శేషాంధ్ర నానా అవ‌స్థ‌లూ ప‌డుతోంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాల‌ని మ‌నం కేంద్రం ముందు ఎంత గొంతెత్తి అరిచినా ఉప‌యోగం ఉండ‌డం లేదు. ఇక ఎన్నిక‌ల‌కు ముందు కూడా ఇటు టీడీపీతో పాటు అటు బీజేపీ నేత‌లు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఖాయ‌మ‌ని ప్ర‌క‌ట‌న‌లు గుప్పించేశారు. ఎన్నిక‌ల‌య్యాక ఇప్పుడు ఏపీ స్పెష‌ల్ స్టేట‌స్ గోడును ప‌ట్టించుకున్న‌వారే లేరు. ఎవ‌రి ప‌నుల్లో వారు బిజీ అయిపోతున్నారు. ఎవ‌రికి వారు ఏదో చిన్న స్టేట్ మెంట్ ఇచ్చేసి ఊరుకుంటున్నారు

తాజాగా ఏపీ గోడు, బాధ‌లపై ఓ కేంద్ర మంత్రి స్పందించారు. దేశం గ‌ర్వించే న‌గ‌రం హైద్రాబాద్ అని, ఈ త‌ర‌హా న‌గ‌రం లేక‌నే.. ఏపీ ఆర్థికంగా ఇబ్బందిప‌డుతోంద‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.అందుకే ఏపీకి తొలి ఏడాది వీలైనంత సాయం అందించామని, రానున్న రోజుల్లో మ‌రింత తోడ్పాటు అందించేందుకు సిద్ధంగా ఉన్నామ‌న్నారు.

ఆర్థికలోటు భర్తీ, రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని తెలిపారు. ఏపీ అభివృద్ధి త‌మ‌కెంతో ముఖ్య‌మ‌ని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌కు ఏపీ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. ప్రత్యేక హోదా అనేది తమ అంజెండాలో ఉందని స్ప‌ష్టంచేశారు. అరుణ్‌ జైట్లీ మాట సాయం వ‌ర‌కు చేశారు...చేత‌ల్లో ఆయ‌న ఏపీకి ఎంత వ‌ర‌కు సాయం చేస్తార‌న్న‌దే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మిగిలింది.