Begin typing your search above and press return to search.
ఇద్దరు చంద్రుళ్ల వినతుల్ని పట్టించుకోని జైట్లీ
By: Tupaki Desk | 12 Jun 2017 4:39 AM GMTకొన్ని సందర్భాల్లో అడిగి లేదనిపించుకోవటం మంచిది. తాజాగా అలాంటి పరిస్థితే తెలుగు రాష్ట్రాల చంద్రుళ్లకు ఎదురైంది. వచ్చే నెల ఒకటి నుంచి జీఎస్టీ చట్టం అమలు కానున్న వేళ.. కేంద్రం ఫిక్స్ చేసిన పన్నులపై పలు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ వినతులపై చర్చ జరిపి.. 66 డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన పన్ను మినహాయింపులపై జైట్లీ పెద్దగా రియాక్ట్ కాలేదు.
పలు అంశాలపై పన్ను బాదుడును తగ్గించాలంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ చేసిన వినతులపై జైట్లీ కఠినంగా వ్యవహరించారనే చెప్పాలి. దాదాపుగా 34 ప్రతిపాదనల్ని జైట్లీ దృష్టికి ఈటెల తీసుకెళ్లగా రెండంటే.. రెండు వినతులపై సానుకూలంగా స్పందించారు. మిగిలిన వాటిని పరిగణలోకి తీసుకోలేదు.
అన్ని రకాల గ్రానైట్ పరిశ్రమలను.. ప్లాస్టిక్ కుర్చీలు.. బిస్కెట్లు.. చేనేత రంగం తదితర అంశాల్ని ఈటెల తెర మీదకు తెచ్చారు. ఇదిలా ఉంటే.. ఆయన రెండింటి మీద మాత్రం సానుకూలంగా స్పందించారు. వాటిల్లో ఒకటి సినిమా టికెట్ల మీద విధించిన పన్ను (రూ.100 కంటే తక్కువ విలువ ఉన్న టికెట్లపై వడ్డీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. ఇక.. కళ్లద్దాలపై విధించిన పన్నును తగ్గించినట్లుగా ఈటెల వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. ఏపీ విన్నవించిన పలు విన్నపాలు చెత్తబుట్ట దాఖలయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి పన్ను మినహాయింపుఇవ్వాలన్న సూచనకు నో చెప్పిన కేంద్రం.. ఏపీకి తలమానికంగా భావించే పోలవరం ప్రాజెక్టు మీద విధించిన సర్వీస్ ట్యాక్స్ కు మినహాయింపు ఇవ్వాలన్న సూచనకు నో చెప్పేశారు. ఇక.. తెలంగాణ ప్రభుత్వ విషయానికి వస్తే.. మిషన్ భగీరథ ప్రాజెక్టులపై ట్యాక్స్ మినహాయింపునకు నో చెప్పేసింది కేంద్రం. దీనిపై మంత్రి ఈటెల అసంతృప్తి వ్యక్తం చేశారు. చిన్న.. మధ్యతరగతి పరిశ్రమలపై పన్నుల భారాన్ని పెద్దగా తగ్గించకపోవటం మేకిన్ ఇండియా నినాదానికి విఘాతం కలుగుతుందంటూ విమర్శించారు. భారీగా కసరత్తు చేసి డజన్ల కొద్దీ విన్నపాలు పెడితే.. రెండంటే రెండు విన్నపాలకు ఓకే అనేయేయటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/