Begin typing your search above and press return to search.
బడ్జెట్ బాదుడు: ఐటీ పన్ను అదే రేంజ్!
By: Tupaki Desk | 29 Feb 2016 7:51 AM GMTకేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మధ్యతరగతి వర్గాలకు ఊహించిన ప్రయోజనాలు దక్కలేదని చెప్పవచ్చని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఆదాయ పరిమితిని రూ.5లక్షలకు పెంచుతారని ఆశించినప్పటికీ మోడీ సర్కారు ఈ విషయంలో నిరాశనే మిగిల్చింది. దేశ నిర్మాణంలో పన్నుదారుడు కీలక పాత్ర పోషిస్తున్నాడని చెప్పిన జైట్లీ వారి ఆకాంక్షపై మాత్రం దృష్టి సారించకపోవడం గమనార్హం. చిన్న మోతాదులో పన్ను కట్టేవాళ్లకు మరింత రిలీఫ్ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. అద్దె ఇళ్లలో ఉన్నవారికి పన్ను పోటు నుంచి మరింత వెసలుబాటు కల్పించనున్నారు. ప్రస్తుతం హెచ్ ఆర్ ఏ కింద ఏడాదికి రూ. 24 వేల వరకు పన్ను మినహాయింపు ఇస్తుండగా ఏడాదికి 60వేల ఇంటి అద్దె కట్టేవాళ్లకు కూడా పన్ను మినహాయింపు కల్పించనున్నారు.
అరుణ్ జైట్లీ తన బడ్జెట్ లో గృహ రుణ వినియోగదారులకు పన్ను మినహాయింపు పెంచుతూ వారికి ఊరట కలిగించారు. గృహ రుణాలపై పన్ను మినహాయింపును మరో 50 వేల రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించారు. పోస్టాఫీసుల్లో ఏటిఎంలు - మైక్రో ఏటిఎంలను సంఖ్యను పెంచనున్నట్లు జైట్లీ చెప్పారు. చిన్న దుకాణాలు - వ్యాపారలుకు ఒకింత ఊరట కలిగించారు. వారు వారంలో ఏఢు రోజులూ వ్యాపారాలు చేసుకోవచ్చునని చెప్పారు. ఉన్నత విద్య కోసం మరో వెయ్యి కోట్లు కేటాయించామన్నారు. వారంలో ఒక రోజు సెలవు నిబంధనను చిన్న దుకాణాలకు మినహాయిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే పొగరాయుళ్లకు బడ్జెట్ లో వాత పెట్టారు. పొగాకు ఉత్తత్తులపై పన్నును పది నుంచి 15 శాతానికి పెంచారు. ఇందులో బీడీలకు మినహాయింపు ఇచ్చారు.