Begin typing your search above and press return to search.

అరుణ్ జైట్లీ తూలి పడ్డారెందుకు.?

By:  Tupaki Desk   |   12 March 2017 10:59 PM IST
అరుణ్ జైట్లీ తూలి పడ్డారెందుకు.?
X
ఊహించని రీతిలో ప్రమాదానికి గురయ్యారు కేంద్ర ఆర్థికమంత్రి.. బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ. ప్రమాదవశాత్తు చోటు చేసుకున్న ఈఘటనను చూస్తే.. ఈ రోజు (ఆదివారం) హరిద్వార్ కు వెళ్లారు జైట్లీ. ఉత్తరాఖండ్ ఎన్నికల్లో భారీ విజయాన్నినమోదు చేసిన నేపథ్యంలో.. అక్కడి నేతల్ని కలిసి..ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన హరిద్వార్ కు వెళ్లారు.

నేతలతో చర్చలు ముగించుకొని వచ్చిన జైట్లీ.. హరిద్వార్ ను ఢిల్లీకి బయలుదేరారు.ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన హెలికాఫ్టర్ ఎక్కే ప్రయత్నంలో ఆయన జారి కిందకు పడ్డారు. తలకు స్వల్పగాయమైనప్పటికీ..వెంటనే ఆయన కదలకుండా ఉండిపోవటం..స్పృహ తప్పిపోవటంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. వెంటనే స్పందించిన అధికారులు.. జైట్లీ ముఖం మీద నీటిని జల్లారు. దీంతో ఆయన కళ్లు తెరిచారు. ఊహించని రీతిలో చోటు చేసుకున్న ఈ ప్రమాదానికి అధికార వర్గాలు.. నేతలు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. ప్రస్తుతం జైట్లీ క్షేమంగా ఉన్నరని.. ఎలాంటి ఆందోళనలు పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/