Begin typing your search above and press return to search.
పాతనోట్ల లెక్కలు జైట్లీకి తెలియవట
By: Tupaki Desk | 5 Jan 2017 7:30 PM GMTపెద్ద నోట్ల రద్దు అనంతరం అందరి చూపు ఎంత మొత్తం బ్యాంకుల్లో జమ అయింది. అందులో నల్లధనం ఎంత అనే అంశాలపైనే పడింది. కొన్ని మీడియాల్లో దాదాపుగా 97శాతం చెలామణిలో ఉన్న నగదు బ్యాంకుల్లో జమ అయినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఇంత మొత్తం బ్యాంకులకు వస్తే మోడీ చేపట్టిన నల్లధన విముక్త భారత్ కాంక్ష నెరవేరనట్లే. ఎందుకంటే పెద్ద నోట్ల రద్దు సమయంలో చెలామణిలో ఉన్న 30 శాతం నల్లధనం అరికట్టేందుకే ఈ నిర్ణయం అని సాక్షాత్తు ప్రధానమంత్రి ప్రకటించారు. ఇలా పరిణామాలు విశ్లేషణలు ఇలా ఉంటే ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం తనకే వివరాలు తెలియవంటూ చేతులు ఎత్తేశారు.
పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు 97% మొత్తం చేరినట్లు వార్తలు వస్తున్నాయనే అంశాన్ని జైట్లీ వద్ద మీడియా ప్రస్తావించగా... నాకు తెలియదు అంటూ జైట్లీ పొడిగా సమాధానం ఇచ్చారు. అదే సమయంలో ఆర్ బీఐ మాత్రం మరో విభిన్నమైన వివరణ ఇచ్చింది. ఇప్పటికే పెద్ద ఎత్తున కరెన్సీ బ్యాంకులకు చేరిందని పేర్కొంటూ త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపింది.
ఇదిలాఉండగా జీఎస్టీ అమలుపై రాష్ట్ర ఆర్థిక మంత్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ మంచి పాలన ఉన్న రాష్ట్రాలు మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయని, సరైన పాలన లేని రాష్ట్రాలు ఆదాయంలోనూ వెనుకంజ వేస్తున్నాయని పేర్కొన్నారు. పెద్దనోట్లరద్దు అనంతరం పన్ను వసూళ్లు 13 శాతం మేర తగ్గాయన్న పశ్చిమబెంగాల్ ఆర్థికమంత్రి అమిత్‌మిత్రా విమర్శల నేపథ్యంలో జైట్లీ ఈ విధంగా వ్యాఖ్యానించారు. పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో ఆదాయం తగ్గలేదని చెప్పారు. ఇటీవల జరిగిన జీఎస్టీ మండలి సమావేశం సందర్భంగా... పలు రాష్ట్రాల ఆర్థికమంత్రులు నవంబర్ నెలలో (నోట్లరద్దు నిర్ణయం వెలువడిన మాసంలో)తమ ఆదాయం పెరిగినట్లు చెప్పారని జైట్లీ గుర్తుచేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/