Begin typing your search above and press return to search.
ఆంధ్రులపై సానుభూతి చూపించడానికి ఆయనెవరు?
By: Tupaki Desk | 8 Feb 2018 11:55 AM GMTఆంధ్రప్రదేశ్ అంటే పౌరుషాలకు పురిటి గడ్డ.. ఆంధ్ర ప్రజలంటే ఆత్మ గౌరవానికి మారుపేరు. ప్రతి ప్రాంతానికీ పౌరుషమైన చరిత్ర ఉంది. రాయలసీమ పేరు చెబితేనే మీసం మెలి తిరుగుతుంది. మధ్య కోస్తాలో పల్నాడు పౌరుషానికి చిరునామా. ఉత్తరాంధ్రలో బొబ్బిలి వీరత్వానికి ప్రతీక. ప్రతి ప్రాంతంలోనూ ఆత్మగౌరవం - ఆత్మాభిమానం - సౌరుషం నిండుగా ఉంటాయి. ఒకరు దయ చూపిస్తే - జాలి చూపిస్తే - సానుభూతి చూపిస్తే సహించే తత్వం కాదు ఆంధ్రులది. తమ హక్కులను పోరాడి సాధించుకుంటారే కానీ, చేయి చాచే ప్రశ్నే లేదు. కానీ... కేంద్ర ఆర్థిక మంత్రికి ఇంకా ఆంధ్రుల ఆత్మగౌరవ చరిత్ర తెలిసినట్లు లేదు. అందుకేనేమో ఆయన ఆంధ్ర అంటే తనకు సానుభూతి ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జైట్లీ వ్యాఖ్యలపై ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. తమపై సానుభూతి చూపిండచమేంటంటూ మండిపడుతున్నారు.
బడ్జెట్ పై చర్చకు సమాధానమిస్తున్న క్రమంలో ఆయన ఏపీకి ఎంతో చేశామంటూ లెక్కలు చెప్పుకొచ్చారు. యూపీఏ హయాంలో ఆర్థికవృద్ధి మందగించిందన్నారు. కానీ, ఎన్డీయే హయాంలో తొలి మూడేళ్లలో జీడీపీ వృద్ధిరేటులో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉన్నామని తెలిపారు. ఈ ఏడాది కాస్త వెనుకబడ్డామని - వచ్చే ఏడాది అగ్రస్థానంలో ఉంటామని స్పష్టం చేశారు. ఏ ప్రాతిపదికన చూసినా అన్ని దేశాల కంటే మనమే ముందని జైట్లీ వ్యాఖ్యానించారు. కేంద్రం - రాష్ట్రాల ఉమ్మడి ప్రయత్నాలతోనే ఘనత సాధించామని చెప్పారు. విమర్శలపై కాంగ్రెస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని జైట్లీ సూచించారు. కాంగ్రెస్ హయాంలో 6గా ఉన్న ద్రవ్యలోటును 3.2కు తీసుకొచ్చామని ఆయన వివరించారు. ప్రస్తుతం సంస్కరణలు కఠినంగా ఉన్నా.. మున్ముందు సత్ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.
జైట్లీ ప్రసంగంలో నిరసన తెలుపుతున్న టీడీపీ ఎంపీలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ పరిస్థితిపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. అక్కడితో ఆగకుండా ఏపీపై తనకు సానుభూతి కూడా ఉందని, కాస్తా ఓపిక పట్టాలని కోరారు.
జైట్లీ చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీలో ప్రజలు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఎక్కడెక్కడో ఉన్న ప్రవాసాంధ్రులు సైతం స్పందిస్తున్నారు. విభజన చట్టంలో ఉణ్న మేరకు ఏపీకి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా మాయ చేస్తుండడమే కాకుండా సానుభూతి ఉందంటూ ముసలికన్నీరు కారుస్తారా అంటూ నెజిటన్లు జైట్లీపై ఆగ్రహిస్తున్నారు.