Begin typing your search above and press return to search.

జైట్లీకి తెలుగోళ్ల‌పై కొత్త డౌట్ వ‌చ్చింది

By:  Tupaki Desk   |   8 March 2018 5:51 AM GMT
జైట్లీకి తెలుగోళ్ల‌పై కొత్త డౌట్ వ‌చ్చింది
X
ప్ర‌త్యేక హోదా ఇచ్చేది లేద‌న్న విష‌యాన్ని ఆచితూచి మాట్లాడుతున్న‌ట్లుగా మాట్లాడుతూనే.. లాగి పెట్టి కొట్టిన‌ట్లుగా మాట‌ల పంచ్ లు వేసిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురించి తెలిసిందే. ఏపీ ప్ర‌జ‌ల‌కు హ‌క్కుగా రావాల్సిన హోదాను.. లేని దాని కోసం ఏపీ త‌హ‌త‌హ‌లాడుతున్న‌ట్లుగా జైట్లీ అభివ‌ర్ణించిన వైనం తెలుగోళ్ల‌కు ఒళ్లు మండేలా చేస్తోంది.

జైట్లీ పెట్టిన ప్రెస్ మీట్ పుణ్య‌మా అని ఏపీలో పొలిటిక‌ల్ హీట్ పీక్ స్టేజ్ కు వెళ్ల‌ట‌మే కాదు.. ఏపీ స‌ర్కారు త‌న కేంద్ర‌మంత్రుల చేత రాజీనామా చేయించేందుకు డిసైడ్ అయ్యింది. ఇంత కీల‌క ప‌రిణామానికి కార‌ణ‌మైన ప్రెస్ మీట్ లో మ‌రో ఆస‌క్తిక‌ర అంశం చోటు చేసుకుంది. అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ న‌డుస్తున్న వేళ తెలంగాణ బీజేపీ నాయ‌కురాలు.. మాజీ మంత్రి పుష్ప‌లీల అక్క‌డ‌కు వ‌చ్చారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏటీఎంల‌లో డ‌బ్బులు లేవ‌ని.. ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నార‌ని.. దీని కార‌ణంగా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ట్లుగా జైట్లీకి చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రియాక్ట్ అయి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాము తెలుగు రాష్ట్రాల‌కు విడుద‌ల చేయాల్సిన దాని కంటే ఎక్కువ క‌రెన్సీని స‌ర‌ఫ‌రా చేశామ‌న్నారు. అయినా.. నోట్ల కొర‌త ఉండ‌టం ఆశ్చ‌ర్యంగా ఉంద‌న్న ఆయ‌న‌.. నోట్ల క‌ట్ట‌ల్ని ఇళ్ల‌ల్లో.. లాక‌ర్ల‌లో దాచుకోవ‌టం వ‌ల్ల ఈ ప‌రిస్థితి ఉండిఉండొచ్చ‌న్న అనుమానాన్ని వ్య‌క్తం చేశారు. ఒక‌వేళ జైట్లీకి అంతే అనుమానం ఉంటే.. త‌మ ప్ర‌భుత్వం మీద ప్ర‌జ‌ల్లో త‌గ్గిన న‌మ్మ‌కానికి నిద‌ర్శ‌నంగా భావించి.. న‌మ్మ‌కాన్ని పెంచేలా వ్య‌వ‌హ‌రించాలే కానీ ఊరికే మాట అనేస్తే స‌రిపోతుందా? ఎప్పుడేం నిర్ణ‌యం తీసుకుంటారో అర్థం కాక‌.. ప్ర‌జ‌ల్ని ప‌ట్టించుకోని మోడీ స‌ర్కారు తీరుపై ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న సందేహాల‌కు స‌మాధానం చెప్ప‌రా జైట్లీ?