Begin typing your search above and press return to search.
ఏపీ లెక్కలు చెప్పలేదు..ఒక్క రూపాయి ఇవ్వలేం..
By: Tupaki Desk | 6 March 2018 1:39 PM GMTఆంధ్రప్రదేశ్‌కు మరోమారు కేంద్రం మొండి చేయి చూపింది. ఇంకా చెప్పాలంటే టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు చేసుకుంటున్న ప్రచార ఒత్తిడి ఫెయిలయింది. కేంద్ర ఆర్థికమంత్రితో రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నానని...త్వరలో ఇవి కొలిక్కి రానున్నాయని టీడీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు ఆచరణ రూపం దాల్చలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగుతున్న అదనపు రాయతీలు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చి చెప్పేశాయి. ముందుగా చెప్పిన విధంగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అమలుకు ఓకే కానీ పరిశ్రమలకు రాయితీలు వంటివి సాధ్యం కాదని చేతులెత్తేసింది. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన విధంగా రాయతీలు ఇవ్వాలంటే రేపు మిగిలిన రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తే పరిస్థితి ఏమిటని ఆర్థిక శాఖ వర్గాలు ఏపీ ప్రతినిధులను ప్రశ్నించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా పదే పదే టీడీపీ జపించే మంత్రానికి చెక్ పెట్టింది. తెలుగు సెంటిమెంట్ అంటూ ఊదరగొట్టడం సరికాదని అర్థిక శాఖ వ్యాఖ్యానించినట్లు సమాచారం. రేపు తమిళులు, ఎల్లుండి కన్నడగులు కూడా సెంటిమెంట్ అంటూ ఆందోళన బాటపట్టే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ప్రత్యేక హోదా కూడా ఏపీకి ఇచ్చే అవకాశాలు లేవని స్పష్టం చేసేసింది. ఇంతేకాకుండా ఏపీ తీరుపైనా ఘాటుగా స్పందించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ నాలుగేళ్లలో 12,500 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ లెక్కలు చెప్పింది. రాష్ట్రానికి ఇచ్చిన సొమ్ములలో ఒక్క రూపాయికి కూడా ఏపీ లెక్కలు చెప్పలేదని పేర్కొంది. ఇంకా ఏపీ అడుగుతున్న విధంగా పన్ను రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేసింది. హామీ ఇచ్చిన మేరకు ప్యాకేజీని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.