Begin typing your search above and press return to search.

సేమ్ టు సేమ్‌:రాజ్య‌స‌భ సీనే లోక్‌స‌భ‌లోనూ..!

By:  Tupaki Desk   |   8 Aug 2016 9:46 AM GMT
సేమ్ టు సేమ్‌:రాజ్య‌స‌భ సీనే లోక్‌స‌భ‌లోనూ..!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలంటూ మొన్న‌టి వ‌ర‌కూ రాజ్య‌స‌భ‌లో ర‌చ్చ జ‌రిగితే..తాజాగా లోక్ స‌భ‌లోనూ షురూ అయ్యింది. ఏపీ కాంగ్రెస్ నేత కేవీపీ రామ‌చంద్ర‌రావు ప్ర‌వేశ‌పెట్టిన ప్రైవేటు బిల్లును రాజ్య‌స‌భ నుంచి లోక్ స‌భ‌కు బ‌దిలీ చేసిన నేప‌థ్యంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి హోదా అంశాన్ని సోమ‌వారం లోక్‌ స‌భ‌లో చ‌ర్చ‌కు తెచ్చారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా మాటేందంటూ మేక‌పాటి లోక్‌ స‌భ‌లో అధికార‌ప‌క్షాన్ని నిల‌దీశారు.

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇవ్వాల్సిందేన‌ని.. ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌త్యామ్నాయం కాద‌న్నారు. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇస్తామంటూ తిరుప‌తి.. నెల్లూరు స‌భ‌ల్లో ప్ర‌ధాని మోడీ ఇచ్చిన హామీని ఈ సంద‌ర్భంగా మేక‌పాటి గుర్తు చేశారు. హోదా అమ‌లుకోసం ఐదుకోట్ల‌మంది ఆంధ్రులు ఆశ‌గా ఎదురుచూస్తున్నార‌ని.. పార్ల‌మెంటులో ఇచ్చిన హామీలు అమ‌లు కాకుంటే చ‌ట్ట‌స‌భ‌ల‌కు ఉన్న విలువేంట‌ని ప్ర‌శ్నించిన మేక‌పాటికి మ‌ద్ద‌తుగా కాంగ్రెస్ నేత‌లు మ‌ల్లికార్జున ఖ‌ర్గే.. స‌మాజ్ వాదీ అధినేత ములాయంసింగ్ యాద‌వ్ మాట్లాడారు.

ఈ నేప‌థ్యంలో ఈ అంశంపై స‌భ‌లోనే ఉన్న కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ క‌ల్పించుకొని స‌మాధానం ఇచ్చారు. విభ‌జ‌న కార‌ణంగా ఏపీకి అన్యాయం జ‌రిగింద‌ని.. ఈ విష‌యంలో ఏపీకి న్యాయం చేసేందుకు కేంద్రం ప్ర‌య‌త్నిస్తుంద‌న్నారు. ఏపీ విభ‌జ‌న సంద‌ర్భంగా చ‌ట్టంలో చాలా హామీలు చేస్తున్న‌ట్లు పేర్కొన్న జైట్లీ.. న్యాయం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌న్నారు. విభ‌జ‌న హామీలు త్వ‌ర‌లోనే ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని.. ఏపీ స‌ర్కారుతో కేంద్రం సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఏపీ హోదాపై జైట్లీ ఇచ్చిన స‌మాధానం చూసిన‌ప్పుడు అనిపించేది ఒక్క‌టే.. వేదిక మారిందే త‌ప్పించి స‌మాధానంలో ఎలాంటి మార్పు లేద‌నే చెప్పాలి. పాడిన పాట‌నే పాడిన జైట్లీకి బోర్ కొట్ట‌టం లేదు కానీ.. వింటున్న ఏపీ ప్ర‌జ‌ల్లో మాత్రం స‌హ‌నం న‌శిస్తోంద‌ని చెప్ప‌క త‌ప్పుదు.