Begin typing your search above and press return to search.
ఇంట గెలవలేకున్నా రచ్చ గెలుస్తున్న పట్టిసీమ
By: Tupaki Desk | 4 April 2016 10:00 AM GMTఏపీ సీఎం చంద్రబాబునాయుడు నదుల అనుసంధానికి నడుం కట్టారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రశంసలు కురిపించారు. నదుల అనుసంధానంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారని ఆయన కితాబిచ్చారు. దిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో భారత జల వారోత్సవాలను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా దేశంలో నదుల అనుసంధానానికి చంద్రబాబు నాంది పలికారని కొనియాడారు. చంద్రబాబు పట్టుదలతో ఒక ప్రాజెక్టును పూర్తిచేశారని... అదే రీతిలో పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని సంకల్పించుకున్నట్లు చెప్పారు. తాగు - సాగు నీటి పథకాలపై తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టిందని జైట్లీ అన్నారు.
అన్ని రాష్ట్రాలు తాగు - సాగునీటి పథకాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని.. ఏపీలో పోలవరం ప్రాజెక్టు పూర్తికి కేంద్రం నుంచి అన్ని విధాల సహకారం అందిస్తామన్నారు.
మొత్తానికి పట్టిసీమపై ఏపీలో విపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా కూడా చంద్రబాబుకు దానిపై బయటనుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మొన్నమొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా పట్టిసీమను పూర్తిచేసిన చంద్రబాబు ధైర్యాన్ని మెచ్చుకోవాలన్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి కూడా పట్టిసీమను జాతీయ స్థాయిలో ప్రస్తావించడమే కాకుండా ప్రశంసించారు.