Begin typing your search above and press return to search.
ఏపీకి హోదా చాన్సేలేదు..ఇప్పటికే ఎంతో చేశాం: జైట్లీ
By: Tupaki Desk | 7 March 2018 1:48 PM GMTఏపీకి కేంద్రం నుంచి మరోమారు అధికారికంగా మొండిచేయి చూపించింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూపంలో బీజేపీ పెద్దలు ఏపీకి నిరాశే మిగిల్చారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి సుజనా చౌదరితో గంటసేపు చర్చించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇప్పుడు ఏ రాష్ట్రానికీ ఇవ్వడం లేదని, ఏపీకి ఇవ్వడం కూడా సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాకి... ప్రత్యేక ప్యాకేజీకి పెద్దగా తేడాలేదని అరుణ్ జైట్లీ విశ్లేషించారు.
14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి వద్దని చెప్పిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ప్రత్యేక హోదా ఉంటే ఏం ఒరుగుతుందని ఎదురు ప్రశ్నించారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం అనవాయితీగా వచ్చేదేనని, తాము ప్రకటన చేసినప్పుడు కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అమలులో ఉందని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. విభజన సందర్భంలో ఆంధ్ర వనరుల కోసం ఇబ్బంది పడుతోందని కాబట్టి ఆంధ్రకు కొన్ని ప్రత్యేక వనరులు ఇవ్వాల్సిందని అన్నారు. హోదా ఇస్తే ఎలాంటి పరిణామాలుంటాయనేది ముఖ్యమైన అంశమని ఆయన పేర్కొన్నారు. తగినన్ని నిధులు లేకపోవడం వల్లే ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చామని వెల్లడించారు. జీఎస్టీ కన్‌కం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంచబడుతుందని అరుణ్ జైట్లీ తెలిపారు.
ఏపీకి నిధులు ఇవ్వమని తాము ఎప్పుడూ చెప్పలేదని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఏపీకి 90:10 నిష్పత్తిలో నిధులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. నాబార్డు ద్వారా నిధులను కేంద్రం ఎస్‌పీవీకి పంపిస్తుందని ఈ రుణాన్ని కేంద్రమే తీర్చేలా ఆలోచిస్తున్నామన్నారు. నాబార్డు ద్వారా నిధులు మంజూరు చేయాలని ఏపీ కోరిందని, నాబార్డుతో చర్చించి ఇందుకు అంగీకరించామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. 14వ ఆర్థిక సంఘం 60:40 నిష్పత్తిలో నిధులు ఇవ్వాలని చెప్పిందన్నారు. ప్రస్తుతం ప్రత్యేక హోదా లేకున్నా ఏపీకి 90 శాతం నిధులు వచ్చేలా నిర్ణయించామన్నారు. నిధులు ఈఏపీ లేదా నాబార్డ్ ద్వారా... ఎలా అయినా ఇచ్చేందుకు సిద్ధమేనని అరుణ్ జైట్లీ వెల్లడించారు.