Begin typing your search above and press return to search.

అందరివి పెరుగుతుంటే.. జైట్లీ ఆస్తులేమో తగ్గాయి

By:  Tupaki Desk   |   3 July 2016 4:44 AM GMT
అందరివి పెరుగుతుంటే.. జైట్లీ ఆస్తులేమో తగ్గాయి
X
రాజకీయ నాయకుల ఆస్తులు ఏ రేంజ్లో పెరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఏడాది గడిచేసరికి వారి ఆస్తుల్లో గణనీయమైన మార్పు ఉంటుంది. ఇక.. పవర్ లో ఉంటే చెప్పాల్సిన అవసరమే ఉండదు. ‘పవర్’కు తగ్గట్లే వారి ఆస్తుల ఎదుగుదల ఎంతోకొంత కనిపించే పరిస్థితి. దీనికి భిన్నమైన పరిస్థితి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆస్తుల విషయంలో చోటు చేసుకుంది.

అత్యంత కీలకమైన స్థానంలో ఉండి.. దేశ ఆర్థిక స్థితిగతుల్ని చూసుకునే అరుణ్ జైట్లీ ఆస్తులు గడిచిన ఏడాదిలో తగ్గటం గమనార్హం. గత ఏడాది మార్చి నాటికి రూ.71.95 కోట్లుగా ఉన్న ఆయన ఆస్తులు.. ఈ ఏడాది మార్చి నాటికి ఆ ఆస్తులు రూ.69.13 కోట్లకు పడిపోవట గమనార్హం.

తన ఆస్తుల్ని.. అప్పుల్ని స్వచ్ఛందంగా బయటపెట్టిన జైట్లీ స్థిరాస్తుల విలువ రూ.35.21 కోట్లుగా ఉన్నాయి. ఆయన బ్యంకు ఖాతాల్లో ఉన్న నగదు రూ.3.52 కోట్ల నుంచి కోటి రూపాయిలకు తగ్గిపోవటం గమనార్హం. వివిధ కంపెనీల్లోపెట్టిన పెట్టుబడుల విలువ రూ.17 కోట్లు ఉండగా.. ఆయన సతీమణి సంగీతతో పాటు ఆయన పేరు మీదున్న మొత్తం ఆస్తుల విలువ రూ.69.13 కోట్లు. దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పే ఆర్థికమంత్రి.. తన వ్యక్తిగత ఆస్తుల్ని ఎందుకు పెంచుకోలేకపోతున్నట్లు..?