Begin typing your search above and press return to search.

ఏపీకి 10 వేల కోట్ల ప్యాకేజీ

By:  Tupaki Desk   |   7 Aug 2016 7:31 AM GMT
ఏపీకి 10 వేల కోట్ల ప్యాకేజీ
X
ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్ ఆగ్రహాన్ని చల్లార్చడానికి గాను కేంద్రం ప్రత్యేక ప్యాకేజీతో వస్తోంది. ప్యాకేజీ ఎలా ఉండాలన్న అంశంలో కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ కసరత్తు పూర్తయితే ప్యాకేజీలో ఏఏ అంశాలుంటాయన్నది కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటిస్తారు. ఏడాదికి రూ.10 వేల కోట్ల చొప్పున మూడేళ్ల పాటు ప్యాకేజీ ఇస్తారని ఎన్డీయే వర్గాల నుంచి వినిపిస్తోంది.

అయితే... ఈ ప్యాకేజీలో కొత్తగా వచ్చేదాని కంటే కేంద్రం నుంచి మనకు రావాల్సినవే వస్తాయని తెలుస్తోంది. విభజనతో నష్టపోయిన రాష్ట్రం రెవెన్యూ లోటులో కూరుకుపోయింది. దీన్ని కేంద్రం భర్తీ చేయాల్సి ఉంది. 2014-15కి సంబంధించి ఇంకా 16 వేల కోట్ల లోటును కేంద్రం ఇంకా భర్తీ చేయాలి. అయితే.. ఆ లెక్కలుఈ లెక్కలు వేసి కేంద్రం దాన్ని 8,400 కోట్లుగానే చెబుతోంది.

దీంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయం.. రాజధాని నిర్మాణానికి ఇవ్వాల్సిన నిధులు.. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాకు ఇవ్వాల్సింది అన్నీ దీనిపరిధిలోకే వచ్చేలా లెక్కట చిట్టా తయారవుతున్నట్లు సమాచారం. దీనిపై కేంద్రం స్పష్టత ఇస్తే కానీ ఏం జరగబోతోందో తెలియదు.