Begin typing your search above and press return to search.
అరుణ్ జైట్లీకి రాష్ర్టపతి పదవి?
By: Tupaki Desk | 25 Jun 2016 5:54 AM GMTకేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా కీలక నిర్ణయం తీసుకోబోతుందా..? అనూహ్య నిర్ణయంతో యావద్భారత దేశాన్ని ఆశ్చర్యంలో ముంచబోతుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మోడీ ప్రభావంతో, ఆరెస్సెన్ ఆమోదంతో భాజపా కీలక నిర్ణయం తీసుకునే దిశగా పయనిస్తోందంటున్నారు. వచ్చే ఏడాది జులైలో ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియనుండడంతో ఆయన స్ధానంలో సరికొత్త అభ్యర్దిని ప్రకటించబోతోందని చెబుతున్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని రాష్ట్రపతి అభ్యర్దిగా ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు.
కేంద్ర మంత్రి వర్గంలో ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడైన మంత్రి జైట్లీ ఒక్కరే. ఏ అంశంపైనైనా మోడీ తొలుత జైట్లీతోనే చర్చిస్తుంటారు. అయితే.. జైట్లీ ఆర్ధిక మంత్రిగా అంత సక్సెస్ కాలేదన్న వాదనా ఉంది. ఆరెస్సెన్ కూడా అదే అభిప్రాయంతో ఉందంటారు. జైట్లీ స్ధానంలో వేరేవాళ్లను ఆర్ధిక మంత్రిగా పెట్టుకోవాలన్నది ఆర్సెస్సెన్ సూచన. దాన్ని ఇంతకాలం కాదంటూ వచ్చిన మోడీ ఇప్పుడు తన అనుంగు అనుచరుడికి అత్యంత ఉన్నత పదవికి నామినేట్ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. నిజానికి మోడీ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో బీజేపీ కురువృద్ధుడు అద్వానీని రాష్ట్రపతి పదవికి పరిశీలిస్తారని అనుకున్నారు. ఆ తరువాత మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇప్పుడు మోడీ దెబ్బకు వారంతా పక్కకుపోయి జైట్లీకి అత్యున్నత పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
యూపీయే ప్రభుత్వంలోనూ దాదాపుగా ఇలాగే జరిగింది. మన్మోహన్ సింగ్ ప్రధాని పదవిలో ఉండగా.. ఆయనకు అండగా ఆర్ధిక మంత్రిగా ప్రణబ్ ఉండేవారు. సోనియా నిర్ణయంతో ప్రణబ్ ను రాష్ట్రపతిని చేశారు. ఇప్పుడు మోడీ కూడా తన ఆర్ధిక మంత్రిని రాష్ట్రపతిని చేస్తారని ఢిల్లీ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఇదే నిజమైతే మోడా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆది అతి పెద్ద రాజకీయ మార్పు కానుంది.