Begin typing your search above and press return to search.
జైట్లీ.. క్రేజీ ఫైటింగ్ మరింత ముదిరింది
By: Tupaki Desk | 21 Dec 2015 9:20 AM GMTకేంద్రంలోని మోడీ సర్కారుకు.. ఢిల్లీ రాష్ట్ర సర్కారుకు మధ్య పంచాయితీ ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలిసిందే. ఈ లొల్లి మరింత విస్తృతమయ్యే పరిణామాలు సోమవారం వరుసగా చోటు చేసుకున్నాయి. డీడీసీఏలో అరుణ్ జైట్లీ గతంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ గత కొద్ది రోజులుగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపణలు చేయటం తెలిసిందే. దీన్ని జైట్లీ ఖండిస్తున్నా.. ఆప్ నేతలతో పాటు విపక్ష నేతలు జట్టుగా చేరి చేస్తున్న విమర్శల్ని న్యాయపరంగా ఎదుర్కోవాలని జైట్లీ నిర్ణయించారు. ఇందులో భాగంగా తనపై చేస్తున్న ఆరోపణలపై అరుణ్ జైట్లీ తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై పరువునష్టం దావా వేశారు.
డీడీసీఏలో తాను అక్రమాలకు పాల్పడినట్లుగా కేజ్రీవాల్ చేసిన ఆరోపణల కారణంగా తన పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లిందంటూ ఢిల్లీ హైకోర్టులో రూ.10కోట్లకు దావా వేశారు. తనతో పాటు.. తన కుటుంబ సభ్యుల మీదా ఆరోపణలు చేస్తున్న ఐదుగురిపై జైట్లీ దావా వేశారు. ఇదిలా ఉంటే.. ఈ పరిణామం అనంతరం ఢిల్లీ రాష్ట్ర సర్కారు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
డీడీసీఏ అధ్యక్షుడి హోదాలో అరుణ్ జైట్లీ 13 ఏళ్ల పాటు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని.. దీనిపై దర్యాప్తు జరపాలని ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా.. పార్టీ నేతలు చేసిన ఫిర్యాదుపై ఢిల్లీ సర్కారు స్పందించింది. జైట్లీ మీద వెల్లువెత్తుతున్న ఆరోపణలపై మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రహ్మణియన్ తో విచారణ చేయించాలని ఢిల్లీ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. చూస్తుంటే జైట్లీ.. కేజ్రీవాల్ మధ్య యుద్ధం మరింత ముదురుతుందన్న భావన కలుగుతోంది.