Begin typing your search above and press return to search.
బాబుపై కేసుకు సీబీఐ ఆఫీస్ కి..!
By: Tupaki Desk | 14 Aug 2015 1:06 PM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఫిర్యాదు చేయటానికి ఒక న్యాయవాది ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అరుణ్ కుమార్ అనే న్యాయవాది ఏపీ ముఖ్యమంత్రి పై ఫిర్యాదు చేశారు.
ఇంతకీ ఆయన వినిపించిన వాదనేమంటే.. ఓటుకు నోటు కేసును పక్కదారి పట్టించటానికి తెరపైకి ట్యాపింగ్ వ్యవహారాన్ని తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. ట్యాపింగ్ పేరుతో కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ కేంద్రంగా సీబీఐ విచారణ సాగితే.. దానిపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆయన.. అవసరాన్ని అనుసరించి కోర్టుకు వెళతానని చెప్పుకొచ్చారు.
వందలాది అక్రమ కేసులు టీడీపీ ఆఫీసు నుంచి నడుస్తున్నాయని.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి.. పాలనకు అడ్డుపడేలా ఉన్నాయని చెప్పుకొచ్చారు. న్యాయవాది అయిన అరుణ్ కుమార్ కు.. హైకోర్టు సాక్షిగా తాము ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా తెలంగాణ ప్రభుత్వమే చెప్పటాన్ని ఎందుకు చెప్పటం లేదో..?