Begin typing your search above and press return to search.
ఇప్పటివరకు ఏ సీఎం చేయని సాహాసం చేసిన పెమా ఖండు !
By: Tupaki Desk | 1 April 2021 2:30 PM GMTముఖ్యమంత్రి .. అంటే ఓ రాష్ట్రానికి పెద్ద దిక్కు. ఇక సీఎం కాన్వాయ్ అంటే ఎన్ని వాహనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారంటే చాలు, అధికారులు ఆ మార్గంలోని రోడ్లను యుద్ధప్రాతిపదికన రెడీ చేస్తారు. అయితే, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు మాత్రం చేసిన ఇప్పటివరకు ఏ సీఎం చేయని అద్భుత సాహసం చేశారు. ఇంతవరకూ ఏ ముఖ్యమంత్రి కూడా చేరుకోని.. మారుమూల కొండ ప్రాంతానికి ఆయన వెళ్లి అందరి మన్ననలు పొందుతున్నారు. దాదాపు రెండురోజుల పాటు 157 కిలోమీటర్లు ప్రయాణించి చాంగ్ లాంగ్ జిల్లాలోని మయన్మార్ సరిహద్దు ప్రాంతం విజయనగర్ చేరుకున్నారు. అనంతరం యాబిన్ గిరిజన ప్రాంత ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి అన్ని సదుపాయాలు అందజేయడానికి వీలుగా 2022 కల్లా రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
అడవులు, కొండలు కొనల మార్గంలో బురద, మట్టిరోడ్డుపై స్వయంగా కారు నడిపారు. రాత్రివేళ అడవిలో చెట్ల కిందే సెక్యూరిటీతో విశ్రాంతి తీసుకున్నారు. సీఎం జర్నీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సాహస యాత్రలో సీఎం మహీంద్రా సంస్థకు చెందిన థార్ ఎస్ యూవీని డ్రైవ్ చేశారు. మహీంద్ర సంస్థకు చెందిన వాహనాన్ని అంత బాగా నడిపినందుకు ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే థార్ యజమానుల ‘హాల్ ఆఫ్ ఫేమ్’ను సృష్టించాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. థార్ పెహెల్వాన్స్ లేదా తార్వాన్స్, నాకు మంచి పేరు సూచిచండి. ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చేర్చడానికి నేను మిస్టర్ ఖండును వెంటనే నామినేట్ చేస్తాను అని ట్వీట్ లో తెలిపారు. సీఎం వాహనాన్ని నడిపిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పర్యటనపై అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బీడీ మిశ్రా పెమాఖండును అభినందించారు. సీఎం అద్భుత సాహసం పై ప్రస్తుతం ప్రశంసలు కురిపిస్తున్నారు.