Begin typing your search above and press return to search.
ఒంటరిగా 122కి.మీ. ఆ సీఎం బైక్ రైడ్
By: Tupaki Desk | 16 Oct 2019 4:33 AM GMTఇదేమీ సినిమా కాదు. నిజంగానే నిజం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బైక్ మీద ఒంటరిగా ప్రయాణించిన వైనం. అది కూడా సరదాగా ఒకట్రెండు కిలోమీటర్లు కాదు. ఏకంగా 122కి.మీ. అంతటి సాహసం చేసిన ఆ ముఖ్యమంత్రి ఎవరో కాదు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండూ.
ఎందుకిలా చేశారంటే.. తమ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే పనిలో భాగంగా ఆయనీ సాహసాన్ని చేశారు. రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ మీద ఒక్కడిగా జర్నీ చేసిన ఆయన విస్మయానికి గురి చేశారు. తన సాహసయాత్ర గురించి ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్ లో పాసిఘాట్ ప్రాంతం బైక్ రైడింగ్.. సాహస క్రీడలకు ప్రసిద్ధి. యాంకియాంగ్ లో మొదలైన సీఎం బైక్ రైడింగ్ పాసిఘాట్ వరకూసాగింది. దీనికి సంబంధించిన వీడియోను ఆయన పోస్ట్ చేశారు.
బైక్ రైడింగ్.. సాహస క్రీడలకు చక్కటి ప్రదేశమైన ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా మరింతమందిని ఆకర్షించేలా ఆయనీ సాహసాన్ని చేశారు. ఆక్టోబరు 13న ఉదయం 8 గంటలకు మొదలైన ఆయన యాత్ర.. పాసిఘాట్ ఎయిర్ పోర్ట్ కు 10.30 గంటలకు చేరుకున్నారు. రాష్ట్రంలో టూరిజాన్ని మరింత పెంచేందుకు వీలుగా ఇలా సాహసాలు చేయటం ఆయనకు అలవాటు. గతంతో పోలిస్తే.. ఈసారి సాహసం మరింత పెద్దదిగా చెబుతున్నారు. ఏమైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా ఒంటరిగా బైక్ మీద ఇన్ని కి.మీ. ప్రయాణం చేయటం మాత్రం విశేషంగా చెప్పక తప్పదు.