Begin typing your search above and press return to search.
ఆయనకు అక్కడ ఒక్క ఓటే వచ్చిందట
By: Tupaki Desk | 15 March 2017 5:11 PM GMTమితిమీరిన ఆత్మవిశ్వాసం.. అంతకు మించిన అత్యాశ కలగలిపితే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గా కనిపిస్తారు. నమ్మి ప్రజలు తనకు అదికారం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. ఢిల్లీ రాష్ట్రాన్ని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మార్చాల్సింది పోయి.. చెత్త కుప్పలా మార్చిన ఘనత కేజ్రీవాల్ కే దక్కుతుంది. అదేమంటే.. ఢిల్లీ రాష్ట్రంలో అధికారమంతా కేంద్రం చేతిలో ఉంటుందని..తమ చేతులుకట్టేశారని..తామేం చేయలేకపోతున్నామంటూ చాలానే మాటలు చెబుతారు. అధికారంలో వచ్చి.. అంత చేశామంటూ ప్రచార హడావుడితో భారీ ప్రచారం చేసుకునే ఆయన తీరుకు.. ఢిల్లీ రాష్ట్ర వాస్తవ పరిస్థితికి అస్సలు పోలికే ఉండదని చెప్పాలి.
చేతిలో ఉన్న ఢిల్లీ పీఠాన్నికాపాడుకునేలా.. మిగిలిన రాష్ట్రాలు అసూయపడేలా చేయలేని కేజ్రీవాల్.. పక్కనున్న రాష్ట్రాల్లో తమ పార్టీ పాగా వేయాలన్న ఆశమాత్రం చాలా ఎక్కువని చెప్పాలి. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అంతో ఇంతో పట్టు ఉన్న పంజాబ్ మీద పూర్తి ఫోకస్ పెట్టకుండా.. అల్లంత దూరాన ఉన్న గోవా మీద కన్నేసి.. రెండూ పోగొట్టుకున్న తీరు చూస్తే.. కేజ్రీవాల్ తెలివితేటలు ఎలా ఉంటాయో అర్థమవుతుంది.
పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సీట్లు సాధించే వీలుందని.. ఏ మాత్రం కలిసి వచ్చినా సంచలనంగా మారి..సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు వినిపించినప్పటికీ.. ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేయటంలో జరిగిన తప్పులతో అటు గోవానే కాదు.. ఇటు పంజాబ్ ను కూడా చేజార్చుకున్నారు.తాను చేసిన తప్పులకు తాను బాధ్యత వహించకుండా అదంతా ఈవీఎంలదని.. వాటిని ట్యాంపరింగ్ చేయటం ద్వారా మోడీ సర్కారు తమను అన్యాయం చేశారని చెబుతున్నారు. ఒకవేళ నిజంగానే కేజ్రీవాల్ మాటలు నిజమనుకుంటే అన్నిరాష్ట్రాల్లోనూ యూపీ మాదిరి బంపర్ మెజార్టీ రావాలే కానీ.. ఉత్తరాఖండ్.. యూపీలో మాత్రమే భారీ విజయం ఎలా సాధ్యమైందన్న చిన్న లాజిక్ ను మిస్ కావటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
అదేమంటే.. ఓ చిత్రమైన ఉదాహరణను చెప్పుకొచ్చారు కేజ్రీవాల్. పంజాబ్ లోని శ్రీ గోవిందపూర్ లో అమ్ ఆద్మీ పార్టీకి ఐదుగురు వాలంటీర్లు ఉన్నారని.. వారంతా తమకే ఓటు వేస్తామని చెప్పారని.. కానీ.. అక్కడ వారికి వచ్చింది మాత్రం ఒకే ఒక్క ఓటు అని చెప్పారు. ‘అదెలా జరిగింది?వారంతా మాకే ఓటు వేస్తామని చెప్పారు. వేశారు కూడా. కానీ.. మాకు వచ్చింది మాత్రం ఒక్క ఓటే’’ అని చెప్పారు. ఓటు పక్కాగా వేశామని చెప్పారు కాబట్టి ఓటు ఉండాలంటూ కేజ్రీవాల్ చెబుతున్న లాజిక్ వింటే.. నోట వెంట మాట రాదంతే. ఆరోపణ చేసేటప్పుడు తర్కబద్ధంగా ఉండాలే కానీ.. ఏ మాత్రం సంబంధం లేని విధంగా ఉండటం కేజ్రీవాల్ చెల్లుతుందని చెప్పాలి. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడేస్తున్న వైనం చూస్తే.. లాజిక్ లేకుండా ఇలా మాట్లాటం ఏమిటన్న భావన కలగటం ఖాయం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/