Begin typing your search above and press return to search.

మహిళలకి ఢిల్లీ సీఎం బంపర్ ఆఫర్!!

By:  Tupaki Desk   |   28 Oct 2019 5:22 PM IST
మహిళలకి ఢిల్లీ సీఎం బంపర్ ఆఫర్!!
X
ఢిల్లీ సీఎం - అమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీ వాల్ మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రభుత్వ బస్సుల్లోమంగళవారం మహిళలు ఉచితంగా ఎక్కడినుండి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు అని తెలిపారు. ఈ రోజు మీడియా తో సీఎం క్రేజీవాల్ మాట్లాడుతూ ..పండుగ సందర్బంగా మంగళవారం మహిళలు ఉచితంగా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించడానికి అవకాశం కల్పించామని అన్నారు.

అలాగే మహిళల భద్రత కోసం 13,000 మంది బస్సు మార్షల్స్ ను నియమించామని తెలిపారు. గతంలో మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తామని ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఆగస్టు 29వ తేదీ ఢిల్లీలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మహిళలు ఉచితంగా బస్సుల్లో సంచరించడానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ బస్సుల్లోనే కాకుండా మెట్రో రైలులో మహిళలకు ఉచితంగా సంచరించడానికి అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.