Begin typing your search above and press return to search.

మోడీ శ‌త్ర‌వులిద్ద‌రు ఏక‌మ‌య్యారు

By:  Tupaki Desk   |   15 Oct 2016 5:10 PM GMT
మోడీ శ‌త్ర‌వులిద్ద‌రు ఏక‌మ‌య్యారు
X
రానున్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో సీన్ మారుతోంది. మోడీని తీవ్ర ఇర‌కాటంలో ప‌డేసిన‌ పటేల్‌ రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు హార్దిక్‌ పటేల్ ఢిల్లీ ముఖ్యమంత్రి - ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్‌ కు మద్దతు తెలిపారు. కేజ్రీవాల్‌ కు పాటిదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి మద్దతు ఇస్తోందని హార్దిక్ పటేల్‌ అన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్‌ కు పటేల్‌ ఒక లేఖ రాస్తూ - తమ వర్గానికి రిజర్వేషన్లు కల్పించడం - ఒబిసిగా గుర్తించడానికి కేజ్రీవాల్‌ మద్దతు ఇవ్వాలని కోరారు.

అంత‌కుముందు పటేళ్ల ప్రభావం అధికంగా ఉన్న మెహ్‌ సనాలోని పిలుద్రా గ్రామంలో బహిరంగ సభలో అర‌వింద్ కేజ్రివాల్‌ మాట్లాడారు. గుజరాత్‌ రాజకీయాలను శుద్ధి చేయడానికి అక్కడి పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి అధ్యక్షుడు హార్దిక్‌ పటేల్‌ మద్దతు కావాలని కేజ్రీవాల్‌ కోరారు. గుజరాత్‌ లో అవినీతికి వ్యతిరేకంగా - పారదర్శక రాజకీయాల కోసం తాము అండగా ఉంటామని అందుకు మ‌ద్ద‌తివ్వాల‌ని కేజ్రి ప్ర‌తిపాదించారు. దీనికి స్పందించిన హార్దిక్ త‌మ మ‌ద్ద‌తును ప్ర‌క‌టించారు. దీంతో మోడీ ఇద్ద‌రు ప్ర‌త్యర్థులు ఏక‌మై ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ముందుకు సాగ‌డం ఖ‌రారైంది.

కాగా స‌భ నేప‌థ్యంలో సూరత్‌ లో కేజ్రీవాల్‌ కు వ్యతిరేకంగా వివాదాస్పద పోస్టర్లు వెలిశాయి. పాకిస్థాన్‌ హీరోలంటూ బుర్హాన్‌ వనీ - హఫీజ్‌ సయీద్‌ - బిన్‌ లాడెన్‌ ఫొటోల మధ్య కేజ్రీవాల్‌ ఫొటోను పెట్టి బ్యానర్‌ లను ఏర్పాటు చేశారు. సూరత్‌ లోని పలు ప్రాంతాల్లో కేజ్రీవాల్‌ కు వ్యతిరేకంగా ఇటువంటి బ్యానర్లు - పోస్టర్లు అంటించారు. గమనించిన ఆప్‌ కార్యకర్తలు వాటన్నింటినీ వెంటనే తొలగించారు. కాగా గుజరాత్‌ లోని సూరత్‌ లో పోస్టర్ల వివాదంపై ఆప్ స్పందించింది. ఈ బ్యానర్లు భాజపానే ఏర్పాటు చేసిందంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. కేజ్రీవాల్‌ గుజరాత్‌ రావడం ఇష్టం లేని భాజపా కార్యకర్తలు ఇటువంటి పనులు చేస్తున్నారని సూరత్‌ ఆప్‌ ప్రతినిధి యోగేశ్‌ జద్వాని ఆరోపించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/