Begin typing your search above and press return to search.
ఆ మాజీ ఎంపీ సీఎం కావాలనుకున్నాడట
By: Tupaki Desk | 31 Dec 2016 5:37 AM GMTఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు - ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ఎన్నికల్లో విజయం కోసం ప్రచార వ్యూహం వేగం చేశారు. పంజాబ్ లో రెండు సభల్లో ప్రసంగించిన కేజ్రీవాల్ గురుదాస్ పూర్ లో విలేకర్లతో మాట్లాడుతూ మాజీ క్రికెటర్ - మాజీ ఎంపి నవజ్యోత్ సింగ్ సిద్ధూ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సిద్ధూ తమ పార్టీ వైపున ఆకర్షితులైన సమయంలో ఆప్ తరఫున ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పామనీ కేజ్రీవాల్ గుర్తుచేశారు. అయితే దాన్ని సిద్దూ తోసిపుచ్చారనీ, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడమే ఆయన హస్తం పార్టీలో చేరిపోవడానికి కారణమని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
”సిద్ధూకు ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేస్తామని మేము చెప్పాం. అయితే ఈ రోజున కాంగ్రెస్ కు సిద్దూ అప్రకటిత సీఎం అభ్యర్థి అనేది అందరికీ తెలుసు. అందుకే ఆప్ ఆఫర్ ను సిద్ధూ తిరస్కరించారు” అని కేజ్రీవాల్ చెప్పారు. ”మా ముఖ్యమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ - బీజేపీ నాయకుల వలే ఉండరు. మా అభ్యర్థి ఉదయం 11 గంటలకి లేవరు - ఉదయం 5-6 గంటలకే లేస్తారు. రాత్రి పదిగంటలవరకూ పని చేస్తారు. ప్రజలు కోరినప్పుడల్లా వాళ్ళను కలుసుకుంటారు. అతనికి స్విస్ బ్యాంకులో ఖాతాలుండవు, ఎస్ బిఐలో ఉంటాయి” అని వ్యాఖ్యానించారు. అయితే ఆప్ సీఎం అభ్యర్థి ఎవరనేది ఆయన వెల్లడించలేదు. సరైన సమయంలో నిర్ణయిస్తామని చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/