Begin typing your search above and press return to search.
ఉచిత పథకాలే చీపురు అస్త్రం..అబ్బే అయ్యే పనికాదంటున్న కమలం
By: Tupaki Desk | 24 Jan 2020 12:53 PM GMTదేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల జోరు ఊపందుకుంది. ఫిబ్రవరి 8న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 1528 నామినేషన్లు దాఖలయ్యాయి. ఢిల్లీలో ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ - బీజేపీ - కాంగ్రెస్ పార్టీల మధ్య ఎన్నికల పోరు జరుగనుంది. అయితే, ఈ ఎన్నికల్లో గెలుపుకోసం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్...ఉచితం మంత్రాన్ని జపిస్తున్నారు. అయితే, ఈ మాజీ ఐఆర్ఎస్ అధికారి విధానాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉచిత కరెంటు - ఉచిత నీరు ఢిల్లీ వాసులకు ఇస్తామని కేజ్రీవాల్ సర్కార్ బీజేపీ భగ్గుమంటోంది. అయితే ఈ పథకం లెక్కలు వేరేనంటున్నారు చీపురు పార్టీ నేత.
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు కేంద్రంలోని బీజేపీపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులు భావిస్తున్నప్పటికీ - జాతీయ జనాభా పట్టిక వల్ల ఎన్నికల్లో తమకు మేలు కలిగే అవకాశాలున్నాయని 'కాషాయ దళం' ఆశాభావంతో ఉంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం విజయవంతమైన కొన్ని పథకాలు తీసుకురావడం..దానికి 'ఫేవర్'గా మారనున్నాయి.
ఐదేళ్ల పాలనలో ఆప్ తీసుకువచ్చిన పథకాల్లో అత్యంత ప్రజాదరణ పొందినవి..ఉచిత నీటి సరఫరా..విద్యుత్ బిల్లులను తగ్గించడం. ఈ పథకాలు ఉన్నత వర్గాల నుంచి మధ్య, పేద తరగతి ప్రజల అభిమానం చూరగొన్నాయి. ముఖ్యంగా ఉచిత నీటి సరఫరాతో లబ్ధి పొందిన వారిలో బీజేపీ ఓటర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు వీరి అభిప్రాయం మారింది. వీరి సైతం ఆప్‌కు అనుకూలంగా మాట్లాడుకుంటున్నారని భోగట్టా. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ప్రభుత్వం వీటినే తన పెట్టుబడిగా ముందుకు దూసుకెళుతోంది. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన పథకాలను సంబంధించిన నాలుగు పేజీల 'రిపోర్ట్ కార్డు'ను ఆప్ విడుదల చేసింది. అంతేకాకుండా పథకాలకు సంబంధించిన ప్రతీ అంశాన్ని ప్రింట్ - టీవీల్లో ప్రకటనల రూపంలో ఊదరగొడుతోంది.
ఈ నేపథ్యంలో బీజేపీ మండిపడింది. ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ మీడియాతో మాట్లాడుతూ - నీళ్లు - విద్యుత్ ఉచితంగా ఇస్తామని చెబుతున్న కేజ్రీవాల్ మాటలకు ప్రజలు మోసపోరని అన్నారు. ఓట్ల కోసమే ఎన్నికల ముందు ఉచిత విద్యుత్ నినాదం కేజ్రీ సర్కార్ అందుకుందని ఫైర్ అయ్యారు. అయితే, దీనికి కేజ్రీవాల్ ఆసక్తికర రిప్లై ఇచ్చారు. అవినీతిని అంతం చేయడం ద్వారా మిగిలే డబ్బులనే ప్రజలకు ఇచ్చే ఉచిత పథకాలపై ఖర్చుచేయడంలో తప్పులేదని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక అంశాలను పేర్కొంటూ ఆయనో ట్వీట్ చేశారు. ``కొన్ని పథకాలు ఉచితంగా పరిమితితో ఇవ్వడం ఆర్థిక వ్యవస్థకు మంచిదే. ఇలాంటి ఉచిత పథకాలు అమలు చేయడం వల్ల పేదల దగ్గర డబ్బులు ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. దీంతో డిమాండ్ పెరుగుతుంది. ఇచ్చే పథకాలపై అధిక పన్నులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి పథకాలతో రాష్ట్రం లోటు బడ్జెట్‌లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలు` అని విశ్లేషించారు.