Begin typing your search above and press return to search.
ఢిల్లీలో సీఎం.. మంత్రులకూ సరి..బేసి!
By: Tupaki Desk | 11 Dec 2015 10:00 AM GMTదేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ రాష్ట్ర సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రోజు విడిచి రోజు వాహనాలు తీసుకెళ్లేలా.. ఒకరోజు సరి.. మరో రోజు బేసి (వాహన చివరి నెంబర్) సంఖ్యల వాహనాల్ని రోడ్ల మీదకు అనుమతిచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. జనవరి ఒకటి నుంచి అమలు కానున్న ఈ రూల్ లోకి రాష్ట్ర ముఖ్యమంత్రి.. మంత్రులు కూడా వచ్చేలా చేయనున్నారు.
ఇక.. కేంద్రమంత్రుల విషయంలో మాత్రం వారికి వారే విచక్షణతో వ్యవహరించేందుకు వీలుగా వదిలేసే అవకశం ఉందని చెబుతున్నారు. కేజ్రీవాల్ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనున్న ఈ నిర్ణయం అమలులో ఎలాంటి రాజీ ఉండకూడదన్నతలంపులో ఉన్నారు. సామాన్యుడికి ఒక నిబంధన.. అసమాన్యుడికి మరో నిబంధన అన్నట్లుగా కాకుండా అందరికి ఒకటే రూల్ అన్నది తాజా నిర్ణయంలో ప్రతిఫలించేలా చూడాలన్నది ఢిల్లీ సర్కారు ఆలోచనగా ఉంది.
ఇక.. మహిళలు.. వికలాంగులు.. రోగులకు మాత్రం మినహాయింపు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి సమగ్ర నివేదికను తయారు చేస్తున్నారు. దీన్ని పూర్తి చేసిన తర్వాత.. సలహాలు.. సూచనల కోసం కేంద్రానికి పంపే వీలుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి.. మంత్రులను కూడా ఈ నిబంధనల పరిధిలోకి తీసుకురావాలన్న ఆలోచనపై హర్షం వ్యక్తమవుతుంది.