Begin typing your search above and press return to search.
బాబుకు మద్దతుగా ఆ సీఎం ప్రచారానికి వచ్చారెందుకు?
By: Tupaki Desk | 29 March 2019 5:15 AM GMTతమ్ముళ్లు.. నాకు పాతిక ఎంపీ సీట్లు ఇవ్వండి.. కేంద్రంలో చక్రం తిప్పుతానంటూ తరచూ చెప్పే చంద్రబాబు.. అందుకు తగ్గట్లే.. తనకున్న పరిచయాల్ని ప్రదర్శిస్తున్నారు. మొన్నటికి మొన్న జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను ఏపీకి తీసుకొచ్చి.. బాబుకు ఓటు వేయాలంటూ ప్రచారం చేయటం తెలిసిందే.
తాజాగా ఇప్పుడు అదే బాటలో పయనించారుఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి.. అమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని.. మోడీకి షాకివ్వాలంటూ ఆయన కోరారు. ఈ సందర్భంగా బాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీలోని పాతిక - ఎంపీ సీట్లలో చంద్రబాబును గెలిపించటం ద్వారా కేంద్రంలో చక్రం తిప్పేలా చేయాలని కోరారు.
కృష్ణా జిల్లాలో ప్రచారం జరిపిన కేజ్రీవాల్.. అంతకు ముందు కృష్ణా.. గుంటూరు జిల్లాల్లో స్థిరపడిన ఉత్తరాదికి చెందిన వారితో మాట్లాడారు. చంద్రబాబు విజయం దేశానికి అవసరమన్న ఆయన.. తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. ఏపీలో పాతిక ఎంపీ స్థానాల్ని చంద్రబాబు గెలిస్తే.. కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం ఉంటుందన్నారు. దేశంలో ప్రధానిగా మోడీ పోవాలన్న అభిలాషను వ్యక్తం చేసిన కేజ్రీవాల్.. ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు అంటూ కీర్తించారు.
దేశంలో మరెవరూ చేయనన్ని సంక్షేమ పథకాల్ని చంద్రబాబు అమలు చేస్తున్నారంటూ కితాబు ఇచ్చిన కేజ్రీవాల్.. అన్ని వర్గాలకు వివిధ పథకాలతో ఆదుకుంటున్నట్లు చెప్పారు. మోడీ తన స్వార్థం కోసం కుల.. మత విద్వేషాలను రెచ్చగొడుతున్నట్లు ఆరోపించిన కేజ్రీవాల్.. జగన్ కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని వ్యాఖ్యానించారు.
ఉమ్మడి రాష్ట్రంలో తాను చేసిన పనుల గురించి గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు శంషాబాద్.. అవుటర్ రింగ్ రోడ్.. హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్ని తానే అభివృద్ధి చేశానని చెప్పారు. రాష్ట్రానికి మోడీ ఏ ఒక్క హామీని అమలు చేయలేదని.. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే సీబీఐ.. ఈడీలను ప్రయోగిస్తున్నట్లు మండిపడ్డారు. తనకుదన్నుగా ఒక మాజీ సీఎం.. ఒక సీఎం.. రానున్నమరికొన్ని రోజుల్లో పలువురు జాతీయ స్థాయి నేతల్ని ఏపీకి తీసుకొచ్చి తనకు అనుకూలంగా ప్రచారం చేసేలా పావులు కదుపుతున్న బాబుకు ఏపీ ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.