Begin typing your search above and press return to search.

త‌బ్లిగీ జ‌మాతేపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ముఖ్య‌మంత్రి

By:  Tupaki Desk   |   19 April 2020 12:30 PM GMT
త‌బ్లిగీ జ‌మాతేపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ముఖ్య‌మంత్రి
X
వాస్త‌వంగా క‌రోనా వైర‌స్ భార‌త‌దేశంలో అంత‌గా వ్యాపించ‌క‌ముందే ముందుగా స్పందించి లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. ఆ లాక్‌డౌన్ వ‌ల‌న క‌రోనా క‌ట్ట‌డికి వ‌చ్చింది. కానీ కొంద‌రి నిర్ల‌క్ష్యం వ‌ల‌న ఇప్పుడు భార‌త‌దేశం క‌రోనా వైర‌స్ బ‌ల‌య్యింది. కొంద‌రు చేసిన త‌ప్పిదంతో ఇప్పుడు భార‌త‌దేశం మొత్తం క‌రోనా విజృంభిస్తూ త‌న పంజా విసురుతోంది. అదే తబ్లీగీ జమాతే మర్కజ్ ప్రార్థ‌న‌లు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఆ ప్రార్థ‌న‌లు జ‌రిగాయి. ఆ ప్రార్థ‌న‌ల‌కు పెద్ద సంఖ్య‌లో దేశం న‌లుమూల‌ల నుంచి వేల సంఖ్య‌లో ఆ మ‌తానికి సంబంధించిన వ్య‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. వారిలో ఏ ఒక్క‌రి క‌రోనా సోకి ఉండ‌గా ఆ ప్రార్థ‌న‌ల‌కు వచ్చిన మిగ‌తా వారికి కూడా సోకింది. దాని ప‌రిణామ‌మే ఇప్పుడు 14 వేల‌కు పైగా క‌రోనా కేసులు రావ‌డం. అయితే ఆ ప్రార్థ‌న‌లు జ‌రిగిన ప్రాంతం ఢిల్లీలో కూడా అత్య‌ధికంగా క‌రోనా కేసులు వ్యాపించాయి. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

త‌బ్లిగీ మ‌ర్క‌జ్ దెబ్బ ప్ర‌ధానంగా ఢిల్లీకే ఎక్కువగా తగిలిందని కేజ్రీవాల్ తెలిపారు. శ‌నివారం ఒక్కరోజే 186 కొత్త కేసులు నమోదవ‌డంపై ఆవేద‌న చెందారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కరోనాకు సంబంధించిన లక్షణాలేవీ గతంలో లేక‌పోయినా వారికి ఇప్పుడు పాజిటివ్ వ‌చ్చింద‌ని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వాపోయారు. క‌రోనా కేసుల్లో ప్రస్తుతం 26 మంది రోగులు ఐసీయూలో - ఏడుగురు వెంటీలేట ర్‌పై ఉన్నారని వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా లాక్‌ డౌన్‌ కు సంబంధించి ఢిల్లీలో ఎటువంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. అయితే వారం తర్వాత సమీక్ష జరిపి ప‌రిస్థితులు సానుకూలంగా ఉంటే అప్పుడు త‌దుపరి నిర్ణయం తీసుకుంటామని సీఎం కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికైతే లాక్‌ డౌన్ ఢిల్లీలో ప‌క‌డ్బందీగా కొన‌సాగుతుంద‌ని.. ఇది ఇలాగే కొన‌సాగేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. ఢిల్లీలో ప్ర‌స్తుతం 1,893 క‌రోనా కేసులు న‌మోదై ఉన్నాయి.