Begin typing your search above and press return to search.
ముఖ్యమంత్రి హౌస్ అరెస్టు.. మోడీ రాజ్యంలోనే ఇలా జరుగుతాయట
By: Tupaki Desk | 8 Dec 2020 1:30 PM GMTమోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ కు పిలుపునివ్వటం.. దానికి బీజేపీయేతర రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వటం తెలిసిందే. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. మోడీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు అన్నదాతలు చేస్తున్న నిరసనలేనని చెప్పాలి. ఈ రోజు దేశ వ్యాప్తంగా జరిగిన భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. అనూహ్యంగా వివిధ వర్గాల నుంచి బారత్ బంద్ కు మద్దతు లభించింది.
తాజాగా జరిగిన భారత్ బంద్ సందర్భంగా ఏకంగా అధికారపక్ష అధినేత.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఢిల్లీ పోలీసులు హౌస్ అరెస్టు చేసి.. ఇంట్లోనుంచి బయటకు రాకుండా కాపాలా కాశారు.ఆ సమయంలో బయటవారు కేజ్రీవాల్ ఇంట్లోకి వెళ్లకుండా నియంత్రించారు. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. భారత్ బంద్ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను హౌస్ అరెస్టు చేశారు.. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపినప్పటి నుంచి ఆయన్ను ఇంట్లో నుంచి పోలీసులు బయటకు రానివ్వటం లేదని పేర్కొంది.
అంతేకాదు.. ముఖ్యమంత్రిని కలవటానికి వెళ్లిన ఎమ్మెల్యేలను పోలీసులు కొట్టారని.. పని కూడా చేసుకోనివ్వటం లేదని ఆరోపించారు ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరవ్ భరద్వాజ్. అయితే.. ఈ ఆరోపణల్ని ఢిల్లీ పోలీసులు ఖండిస్తున్నారు. తాము ముఖ్యమంత్రిని గృహ నిర్భంధంలో ఉంచామని చెప్పటం నిజం కాదన్నారు. ఇతర పార్టీలకు.. ఆమ్ ఆద్మీ పార్టీలకు మధ్య ఘర్షన తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు మాత్రమే తీసుకున్నట్లుగా ఆయన చెప్పారు.
పోలీసుల వాదనకు ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. తమ నేతలతో పోలీసులకు జరుగుతున్న వాగ్వాదానికి సంబంధించిన వీడియోను పోస్టు చేసి..నిజాల్ని బయటకు రానివ్వకుండా ఉండలేరని.. ఆధారాల్ని తారుమారు చేయొద్దని పేర్కొంది. వీడియోలో ఉన్నదేమిటో చెప్పాలని పోలీసుల్ని ప్రశ్నించింది. ఏమైనా.. మోడీ రాజ్యంలో మాత్రమే ఇలాంటివి జరుగుతాయేమోనని చెప్పాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి భారత్ బంద్ కు అనుమతిస్తే.. ఆయన్ను హౌస్ అరెస్టు చేసిన వైనం మాత్రం చరిత్రలో అలా మిగిలిపోతుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
రైతులకు అండగా తాము ఉన్నామంటూ పలు సంఘాలు రోడ్ల మీదకు రావటం ఒక విశేషమైతే.. ఈ బంద్ మొత్తంలో హైలెట్ అంశం ఒకటి చోటు చేసుకుంది. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. సాధారణంగా రాజకీయ నేతలు బంద్ కు పిలుపునిచ్చినప్పుడు..ముందస్తు జాగ్రత్తగా పోలీసులు సదరు విపక్ష నేతల్ని హౌస్ అరెస్టుచేసి.. ఇల్లు కదలకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.