Begin typing your search above and press return to search.
గెలుపుతోనే కాదు ఇన్విటేషన్ తోనూ మోడీకి షాకిచ్చిన కేజ్రీ
By: Tupaki Desk | 14 Feb 2020 12:18 PM GMTఊహించని పనులు చేయటం అందరికి సాధ్యం కాదు. మిగిలిన రంగాల్లో ఎలా ఉన్నా రాజకీయ రంగంలో.. అందునా కీలక నేతలు కొన్ని పరిమితుల్ని.. పరిధుల్ని దాటేందుకు ఏ మాత్రం ఇష్టపడరు. అందుకు భిన్నంగా వ్యవహరించి షాకిచ్చారు ఢిల్లీ రాష్ట్రముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ముందుగా అనుకున్న ప్రకారం ఈ రోజు (ఫిబ్రవరి 14న) ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయాల్సిన క్రేజీవాల్.. అందుకు భిన్నంగా ఆదివారం (ఫిబ్రవరి 16) ప్రమాణస్వీకారం చేయనున్నారు.
దేశంలోని మరే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇన్విటేషన్ పంపని క్రేజీ.. తన ప్రమాణస్వీకారోత్సవాన్ని రామ్ లీలా మైదానంలో చేయాలని డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. మొన్న విడుదలైన ఫలితాల్లో 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఏకంగా 62 స్థానాల్లో విజయాన్ని సొంతం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ మోడీ పరివారానికి భారీ షాకిచ్చింది. ఈ ఎన్నికల్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ.. గెలిచేందుకు సర్వశక్తుల్ని ఒడ్డింది. అయినప్పటికీ కమలనాథుల కలలు సాకారం కాలేదు.
ఎంతగా ప్రయత్నించినా అంతిమ ఫలితం ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా వచ్చింది. ఫలితాలు వెలువడిన రోజున ప్రధాని మోడీ స్పందిస్తూ.. ఎన్నికల్లో విజయం సాధించిన క్రేజీవాల్ కు ట్వీట్ తో అభినందనలు తెలియజేశారు. ఎన్నికల వేళ ఎంత దూకుడుగా వ్యవహరిస్తారో.. ఎన్నికల ఫలితాలు వచ్చాక మహా జెంటిల్ అన్నట్లుగా మోడీ వ్యవహరించటం మొదట్నించి చూస్తున్నదే.ఇలాంటి తీరుకు తాజాగా క్రేజీ భారీ షాకిచ్చారు.
తన ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఊహించని రీతిలో ప్రధానిని ఆహ్వానించటం ద్వారా క్రేజీవాల్ ఆసక్తికర చర్చకు తెర తీశారని చెప్పాలి. మరి.. క్రేజీ ఆహ్వానాన్ని మన్నించి మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి వస్తారా? అన్నది ప్రశ్న. అలా వస్తే ఆయన మోడీ కారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. ఢిల్లీ ఎన్నికల ఫలితంతోనే కాదు.. తాజాగా ప్రమాణస్వీకార ఇన్విటేషన్ తోనూ ప్రధాని మోడీకి క్రేజీ షాకిచ్చారన్న మాట వినిపిస్తోంది.