Begin typing your search above and press return to search.

త‌మిళ పాలిటిక్స్‌లో కేజ్రీ వేలెట్టేశారా?

By:  Tupaki Desk   |   21 Sep 2017 9:45 AM GMT
త‌మిళ పాలిటిక్స్‌లో కేజ్రీ వేలెట్టేశారా?
X
ఊహించ‌ని మ‌లుపుల‌తో అంతుచిక్క‌ని వ్యూహాల‌తో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ ను త‌ల‌పిస్తున్నత‌మిళ హైడ్రామాకు ముగింపు ఎప్పుడు దొరుకుతుందా అని రాష్ట్ర ప్ర‌జ‌ల‌తో పాటు.. దేశ ప్ర‌జ‌లు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక‌ప‌క్క త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పొలిటిక‌ల్ ఎంట్రీకి సిద్ధ‌మ‌వుతుంటే.. రాజ‌కీయాల్లోకి `నేను వ‌స్తున్నా` అంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు లోక‌నాయ‌కుడు క‌మ‌ల్‌ హాస‌న్‌!! ఇప్ప‌టికే ఎవ‌రు ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తారో తెలియ‌క గంద‌ర‌గోళంలో ఉంటే.. ఇప్పుడు తెర‌పైకి ఆప్ నేత - ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎంట‌ర‌య్యాడు. వ‌చ్చీ రాగానే లోక‌నాయ‌కుడితో భేటీ కాబోతున్నాడు. ఇప్పుడు త‌మిళ‌నాట ఇదే హాట్ టాపిక్ కాబోతోంది!!

త‌మిళ హీరోల మ‌ధ్య పొలిటిక‌ల్ వార్‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ త‌మిళ సినిమా తెర‌పై పోటీ ప‌డిన ర‌జ‌నీ కాంత్‌ - క‌మ‌ల్‌ హాసన్ ఇప్పుడు రాజ‌కీయ తెర‌పై సై అంటే సై అంటున్నారు. ఇందులో ముందుగా క‌మ‌ల్‌హాస‌న్‌.. ఘాటైన విమ‌ర్శ‌ల‌తో దూసుకుపోతున్నాడు. అటు అన్నాడీఎంకేపై విమ‌ర్శ‌లు గుప్పించేస్తు న్నాడు. దీంతో ఆయ‌న ఏ పార్టీలో చేర‌తార‌నే చ‌ర్చ మొద‌లైంది. ఇదే అదునుగా ఇప్పుడు కేజ్రీవాల్ రంగంలోకి దిగారు. కమల్ హాసన్ తో గురువారం భేటీ కానున్నారు. చెన్నైలోని కమల్ హాసన్ ఇంటికి వెళ్లి కలుసుకోనున్నారు. ఇందులో రాజ‌కీయాల‌పై ఇద్ద‌రూ సుదీర్ఘంగా చ‌ర్చిస్తార‌ని తమిళ ఆప్ నాయ‌కులు చెబుతున్నారు.

తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వం మీద గత కొంత కాలంగా కమల్ హాసన్ మండిపడుతున్న విషయం తెలిసిందే. అన్నాడీఎంకే ప్రభుత్వంలోని మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని కమల్ హాసన్ బహిరంగం గానే విమర్శించారు. ఇక డీఎంకే పార్టీ నుంచి కమల్ హాసన్ కు పరోక్షంగా మద్దతు ఉంది. ఇప్ప‌టికే కేజ్రివాల్‌.. పంజాబ్ ఎన్నిక‌ల్లో పోటీకి దిగి ఎదురుదెబ్బ‌లు తిన్న విష‌యం తెలిసిందే! మ‌రి ఇప్పుడు త‌మిళ‌నాడుపైనా ఆయ‌న క‌న్ను వేసిన ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే క‌మ‌ల్‌ హాస‌న్‌ తో భేటీ కావ‌డం మ‌రెన్ని రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌కు తెర‌తీస్తుందో!!