Begin typing your search above and press return to search.
ఢిల్లీ సీఎంకి ఘోర అవమానం..మోలానియా స్కూల్ ప్రోగ్రాం లో కేజ్రీ పేరు గల్లంతు!
By: Tupaki Desk | 22 Feb 2020 3:30 PM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా.. ఆయన భార్య - అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఢిల్లీ ప్రభుత్వ స్కూలును సందర్శించి - అక్కడ అమలయ్యే హ్యాపీ కరుక్యులమ్ గురించివివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అయితే మెలానియా ట్రంప్ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలు కూడా భాగస్వాములు అవుతారని వార్తలు బాగా వినిపించాయి.
అయితే తాజాగా సీఎం కేజ్రీవాల్ కు - మనీష్ సిసోడియాలకు కానీ అలాంటి ఆహ్వానం ఏమీ లేదని ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు తేల్చేశాయి. అయితే , దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రప్రభుత్వం మనసులో ఎదో కుట్ర పెట్టుకొని - సీఎం కేజ్రీవాల్ పేరును జాబితా నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించిందని ఆప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక అగ్రరాజ్యపు ప్రథమ మహిళ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రిని ఆహ్వానించకపోవడం సమంజసం కాదు అని విమర్శిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో రాజకీయాలు చేయరాదని హితవు పలికారు. రాజకీయాలు ఎప్పుడూ ఉండేవే అని ఇలాంటి సందర్భాల్లో అంతా అందరం కలిసి ఐక్యత చాటాలని చెప్తున్నారు. దీనిపై ప్రస్తుతం ఢిల్లీ రాజకీయ వర్గాలలో పెద్ద చర్చ నడుస్తుంది.