Begin typing your search above and press return to search.
కేజ్రీవాల్.. మఫ్లర్ ఎక్కడ?
By: Tupaki Desk | 27 Dec 2019 6:03 PM GMTఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను తలుచుకోగానే ఆయన ముఖంతో పాటు మఫ్లర్ కూడా గుర్తుకొస్తుంది. ముఖానికి మఫ్లర్ చుట్టుకోవడం అన్నది ఆయన జీవనంలో ఒక భాగం అయిపోయింది. ఆయన చలికి తట్టుకోలేరన్న సంగతి అందరికీ తెలుసు. ఆయనకు విపరీతమైన దగ్గు సమస్య కూడా ఉండేది ఒకప్పుడు. సర్జరీ ద్వారా ఆ సమస్యను పరిష్కరించుకున్నప్పటికీ.. చలికి తట్టుకోలేక మఫ్లర్ ఉపయోగించడం మాత్రం మానలేదు. ఐతే ఈ మధ్య కేజ్రీవాల్ మఫ్లర్ వాడట్లేదట. ఆయన మఫ్లర్ లేకుండానే సమావేశాల్లో ప్రెస్ మీట్లలో పాల్గొంటుండటంతో నెటిజన్లకు సందేహాలొచ్చాయి. మఫ్లర్ మ్యాన్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టి.. కేజ్రీవాల్ ఈ మధ్య మఫ్లర్ ఎందుకు వేసుకోవట్లేదంటూ ఒక చర్చ పెట్టారు.
కొద్ది రోజుల నుంచి ఢిల్లీలో చలి తీవ్రత విపరీతంగా ఉన్నా.. కేజ్రీవాల్ మాత్రం మఫ్లర్లను ఉపయోగించేడం లేదని గుర్తించిన కొందరు.. కేజ్రీ ఇలా ఎలా మారిపోయారని ప్రశ్నిస్తున్నారు. ఓ నెటిజన్ అయితే నేరుగా సీఎం కేజ్రీవాల్‌ను.. మఫ్లర్ ఎందుకు ఉపయోగించడం లేదంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించాడు. ”చలి కాలం ప్రారంభమైనా ఈసారి ఇంకా మఫ్లర్ బయటకు తీయడం లేదేంటి..? ఏమైందంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు” అతను కేజ్రీని ట్యాక్ చేస్తూ ప్రశ్నించాడు. ఈ ట్వీట్‌కు స్వయంగా కేజ్రీనే సమాధానం ఇవ్వడం విశేషం. ‘‘మఫ్లర్ ఎప్పుడో బయటికి వచ్చింది. కానీ మీరే గమనించలేదు. అసలే చలి తీవ్రత ఎక్కువైంది. అంతా జాగ్రత్తలు తీసుకొండి’ అంటూ ఫన్నీ ఎమోజీ పెట్టి బదులిచ్చాడు కేజ్రీ. ఈ ట్వీట్లు రెండూ ట్విట్టర్లో వైరల్ అయ్యాయి.