Begin typing your search above and press return to search.

ఢిల్లీ ప్ర‌యాణికుల కోసం క్రేజీ డెసిష‌న్‌

By:  Tupaki Desk   |   4 Dec 2015 10:33 AM GMT
ఢిల్లీ ప్ర‌యాణికుల కోసం క్రేజీ డెసిష‌న్‌
X
ఢిల్లీలో ఇదేం ప‌రిస్థితి? ప‌్ర‌జా జీవితంలో నివ‌సిస్తున్న‌ట్లుగా లేదు గ్యాస్ చాంబ‌ర్‌లో ఉన్న‌ట్లు ఉంది@ అని ఢిల్లీ హైకోర్టు ఘాటు వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి అర‌వింద్‌ కేజ్రివాల్ వినూత్న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న‌దైన శైలిలో క్రేజీ నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ముందుండే కేజ్రివాల్ ఈ ద‌ఫా సామాజిక కార్య‌క్ర‌మంలో భాగంగా ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌పై దృష్టిసారించారు. ఢిల్లీలో వేగంగా పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరిక‌ట్ట‌డంలో భాగంగా వాహ‌న‌దారుల‌కు స్ప‌ష్ట‌మైన, కొత్త ఆదేశాలు ఖ‌రారు చేశారు.

కేజ్రీ తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం ఢిల్లీలోని వాహ‌నదారులు త‌మ వాహ‌న నంబ‌రులోని చివ‌రి సంఖ్య బేసి సంఖ్య అయితే ఒక‌రోజు, స‌రి సంఖ్య అయితే మ‌రోరోజు వాహ‌నాన్ని రోడ్డుమీద‌కు తీసుకురావాల్సి ఉంటుంది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. వాహ‌న స‌దుపాయం లేని వారు ప్ర‌జార‌వాణ‌ను ఉప‌యోగించుకోవచ్చ‌ని వివ‌రించారు.

కాలుష్యాన్ని అరిక‌ట్టే క్ర‌మంలో ప్ర‌భుత్వం తీసుకున్న కొన్ని నిర్ణ‌యాలు ఈ విధంగా ఉన్నాయి.

- ఢిల్లీ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ సౌల‌భ్యాన్ని మ‌రింత మెరుగుప‌ర్చ‌నున్నారు. రోడ్ల‌పై బ‌స్సుల సంఖ్య‌ను పెంచి ప్ర‌జా ర‌వాణాను మ‌రింతగా అందుబాటులోకి తేనున్నారు.

- ప్ర‌స్తుత సర్వీసుల‌కు తోడుగా మ‌రిన్ని స‌ర్వీసులు న‌డ‌పాల‌ని ఢిల్లీ మెట్రో అథారిటీని ప్ర‌భుత్వం కోరింది.

- కాలుష్య కార‌క‌మైన‌ బ‌దార్‌పూర్ ప‌వ‌ర్‌ప్లాంట్‌ను కూడా మూసివేసే దిశ‌గా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

- ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని దాద్రీ థ‌ర్మ‌న్ ప్లాంట్‌ను మూసివేసే దిశ‌గా నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్‌ను ఆశ్ర‌యించనుంది.

- న‌గ‌రంలో ఎక్క‌డైనా చెత్త కాల్చివేస్తే దాన్ని ప్ర‌భుత్వం దృష్టికి వ‌చ్చే దిశ‌గా ప్ర‌త్యేక‌మైన ఆప్‌ను అందుబాటులోకి తేనున్నారు.