Begin typing your search above and press return to search.
కేజ్రీవాల్ ను తీసిపడేస్తున్నారు..
By: Tupaki Desk | 7 Sep 2015 11:13 AM GMTఢిల్లీ మెట్రో లైన్ ప్రారంభ కార్యక్రమానికి సాక్షాత్తు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రయిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఆహ్వానం అందలేదు. బదర్ పూర్-ఫరీదాబాద్ మెట్రో లైన్ కు ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభోత్సవం చేసిన సంగతి తెలిసిందే. ప్రొటోకాల్ ప్రకారం ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే తనతో ఢీ అంటే ఢీ అంటున్న కేజ్రీవాల్ ను మానసికంగా దెబ్బతీయడానికి కేంద్రం పెద్ద ఎత్తుగడే వేసింది.. అందుకోసం నిబంధనలకు తిలోదకాలిచ్చింది. కనీస మర్యాద కూడా పాటించకుండా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, హర్యానా సర్కార్, కేంద్ర ప్రభుత్వాలు కేజ్రీవాల్ ను ఆహ్వానించలేదు. ఇది ఆయన్ను మానసికంగా దెబ్బతీయడానికి... ఢిల్లీలో అంతా కేంద్రానిదే పెత్తనం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆటలో అరటిపండే అన్న సంకేతాలు పంపడానికి కేంద్ర ప్రభుత్వం ఇలా చేసినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
దీనిపై తీవ్రంగా స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర ప్రభుత్వం నీచ రాజజీయాలకు పాల్పడుతోందని విమర్శించింది. అయితే దీనిపై బీజేపీ మాత్రం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రధాని నరేంద్రమోడీని కానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కానీ ఎవరినో ఒకరినే ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తామని పేర్కొందని చెబుతోంది. అయితే దీనిపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వర్గాలు మాత్రం ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదని... ఇది పూర్తిగా హర్యానా ప్రభుత్వ అధికార కార్యక్రమం అని, ఆహ్వానాల విషయంలో తమకేమీ సంబంధం లేదని చెబుతున్నాయి.