Begin typing your search above and press return to search.
మోడీకి మంటెత్తిన వ్యక్తిని సీన్లోకి తెస్తున్నారట
By: Tupaki Desk | 8 Nov 2017 9:18 AM GMTనిత్యం వార్తల్లో కనిపిస్తూ సందడి చేసే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గడిచిన కొన్ని నెలలుగా వార్తల్లోకి అస్సలు రావటం లేదు. ఒక దశలో పరిస్థితి ఎలా తయారైందంటే.. ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఢిల్లీ రాష్ట్ర ప్రజల ఇబ్బందుల గురించి పూర్తిగా విస్మరించి.. పనికిరాని రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా విమర్శలు అంతకంతకూ పెరిగాయి.
ఇదే తీరులో కొనసాగితే మొదటికే మోసం వస్తుందన్న సూచనలతో ఆయన అలెర్ట్ అయ్యారు. దీంతో. .కొంతకాలంగా ఆయన వార్తల్లోకి రావటం లేదు. ఇదిలా ఉంటే.. ఉన్నట్లుండి సంచలన నిర్ణయంతో వార్తల్లోకి వచ్చారు క్రేజీవాల్. యూపీఏ హయాంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా వ్యవహరించిన రఘురామ్ రాజన్ ను రాజ్యసభకు నామినేట్ చేయాలన్న ఆలోచనను బయటపెట్టింది అమ్ ఆద్మీ పార్టీ.
2015 ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఘనవిజయం సాధించటం.. ఆ పార్టీ నుంచి ముగ్గురు సభ్యులను త్వరలో రాజ్యసభకు పంపనున్న విషయం తెలిసిందే. వీరి పదవి కాలం జనవరి నుంచి ప్రారంభం కానుంది. ముగ్గురిలో ఒకరుగా రాజన్ ను రాజ్యసభకు పంపాలని కేజ్రీవాల్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఆర్ బీఐ గవర్నర్ గా తన పదవీ కాలంలో మోడీ మనసు దోచుకోలేకపోయిన రాజన్.. తనకెంతో ఇష్టమైన అధ్యాపక వృత్తిని ఎంచుకొని వెళ్లిపోయారు. ప్రస్తుతం చికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. నిజానికి ఆర్ బీఐ గవర్నర్ గా రెండో దఫా కొనసాగాలన్న ఉద్దేశం రాజన్ కు ఉన్నప్పటికీ మోడీ సర్కారుకు ఇష్టం లేకపోవటంతో ఆయన కొనసాగలేదు ఇదిలా ఉండగా.. మోడీకి ఇబ్బంది పెట్టేలా రాజన్ ను రాజ్యసభకు తీసుకురావాలన్న కేజ్రీవాల్ నిర్ణయానికి ఆర్ బీఐ మాజీ గవర్నర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.