Begin typing your search above and press return to search.
ద వన్ అండ్ ఓన్లీ ఇండియన్ కేజ్రీవాల్
By: Tupaki Desk | 25 March 2016 7:39 AM GMT మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి భారత ప్రధాని పీఠాన్ని అధిరోహించిన నరేంద్ర మోడీ ఇటీవల కాలంలో చాలామంది చేతిలో ఓడిపోతున్నారు. మొన్నమొన్నటి వరకు సోషల్ మీడియా కింగ్ గా ఉన్న ఆయన మొన్న ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్యలో బిగ్ బీ అమితాబ్ కంటే వెనుకబడిపోయారు. తాజాగా ప్రపంచ గొప్ప నేతలు అంటూ 50 మందితో ఫార్చ్యూన్ మ్యాగజీన్ రూపొందించిన జాబితాలో కూడా మోడీ చోటు పొందలేకపోయారు. మోడీకి చోటు దొరక్కపోతే పోయింది కానీ, ఆయన బద్ధ శత్రువు - ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు అందులో 42 వస్థానం దక్కడం మోడీకి ఓటమిగానే పరిగణించాలి.
అవును... అమెరికాకు చెందిన ఫార్చ్యూన్ మ్యాగజీన్ వెల్లడించిన 50 మంది ప్రపంచ గొప్ప నేతల జాబితాలో అరవింద్ కేజ్రీవాల్ కు స్థానం దొరికింది. ఇండియా నుంచి ఆయన ఒక్కరి పేరే ఆ జాబితాలో ఉంది. ఇందులో మోడీకి కూడా స్థానం దొరకలేదు. దీంతో కేజ్రీ అరుదైన ఘనత సొంతం చేసుకున్నట్లయింది. కాగా ఈ జాబితాలో అమెజాన్ సీఈఓ జోఫ్ బెబోస్ మొదటిస్థానంలో ఉణ్నారు. మొత్తం జాబితాలో చోటు సాధించిన ఏకైక భారతీయుడు కేజ్రీయే కావడం గమనార్హం. వ్యాపారం - గవర్నమెంటు - ఫిలాంథ్రపీ - కళారంగాల్లోని వారి నుంచి 50 మందితో ఈ జాబితా రూపొందించారు.
ఢిల్లీలో వాహనాల వాడకం తగ్గించి కాలుష్య నివారణకు మార్గం వేసినందుకు గాను కేజ్రీకి ఈ గుర్తింపు దక్కింది. కాగా జాబితాలో జర్మనీ ఛాన్సులర్ మెర్కెల్ రెండో స్థానంలో... మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీ మూడో్ స్థానంలో, పోప్ ఫ్రాన్సిస్ 4... యాపిల్ సీఈఓ టిమ్ కుక్ 5వ స్థానంలో నిలిచారు.