Begin typing your search above and press return to search.
మోడీ మిత్రుడి నిప్పులు
By: Tupaki Desk | 2 Oct 2015 1:53 PM GMT"ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మా మిత్రుడే. ఆ రాష్ర్ట పాలనలో జోక్యం చేసుకోం. అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాం" అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినప్పటికీ....కేజ్రీవాల్ మాత్రం తనదైన శైలిలో అవకాశం దొరికినపుడల్లా మోడీపై విరుచుకుపడుతున్నారు. తాజాగా గాంధీ జయంతి సందర్భంగా మోడీ మానస పుత్రిక అయిన స్వచ్ఛభారత్ కేంద్రంగా ప్రధానమంత్రిపై తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు.
మహాత్మాగాంధీని గౌరవించిన మోడీ మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని విస్మరించడం సరికాదని కేజ్రీ పేర్కొన్నారు. దేశానికి సేవ చేసిన వారిలో శాస్త్రి కూడా కీలక నేతగా గుర్తించాలని, అలాంటి జాతీయ నాయకుడికి ప్రధాని నివాళలర్పించకపోవడం మంచి పరిణామం కాదన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. మోడీ ప్రభుత్వం చేస్తున్న వాగ్దానాలకు, చేపడుతున్న కార్యక్రమాలకు తగ్గట్టుగా కార్యాచరణ కూడా ఉండాలన్నారు. ఫోటోల కోసం ఏడాదికొకసారి వీధులు శుభ్రం చేస్తే స్వచ్ఛ భారత్ కల నెరవేరదంటూ కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.
మహాత్మాగాంధీ 146వ జయంతి సందర్భంగా రాజ్ ఘాట్ సందర్శించి గాంధీజీకి నివాళులర్పించిన కేజ్రీవాల్ అనంతరం లాల్ బహదూర్ శాస్త్రికి కూడా అంజలి ఘటించారు. స్వచ్ఛ భారత్ అంటూ పాటలు పాడితే, చీపురు పట్టుకుని వీధులు శుభ్రం కావని విమర్శించారు. అసలు స్వచ్ఛ భారత్ కోసం ఇప్పటి వరకు ఎంత డబ్బు ఖర్చు చేశారో వెల్లడించాలని అన్నారు. గత ఏడాది స్వచ్ఛ భారత్ మిషన్ కోసం వెచ్చించిన నిధుల లెక్కలు ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా శుభ్రమైన వీధుల వివరాలు కావాలంటే కేజ్రీవాల్ ట్విట్ చేశారు. ఈ వివరాలను అడగాల్సిన సందర్భం ఇదేనని ఆయన వ్యాఖ్యానించారు. పనిలో పనిగా బీఫ్ నిషేధం మనుషుల ప్రాణాలను హరిస్తోందంటూ పరోక్షంగా పంచ్ లు వేశారు.