Begin typing your search above and press return to search.
రాహుల్ ఆధారాలు...కేజ్రీ వివరాలు
By: Tupaki Desk | 16 Dec 2016 6:25 AM GMTప్రధాని నరేంద్రమోదీపై తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మోదీ అవినీతిపై తిరుగులేని బుల్లెట్ ప్రూఫ్ సాక్ష్యాలున్నాయని స్పష్టం చేశారు. సాక్ష్యాధారాలన్నింటిని కూలంకషంగా పరిశీలించానని, అవి ఎవరూ కొట్టిపారేయలేనివిగా ఉన్నాయని రాహుల్ గాంధీ చెప్పారు. తాను వెల్లడించే నిజాలు నిజంగానే భూకంపం తరహాలో ప్రభావం చూపుతాయని ఆయన పలువురు కాంగ్రెస్ ఎంపీలతో అన్నారు. తన వ్యాఖ్యల తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన పార్టీకి ఉండనక్కరలేదని రాహుల్ స్పష్టం చేశారు. సరైన సాక్ష్యాధారాలుంటే తప్ప అలాంటివాటికి ప్రజామోదం లభించదని, తేలిపోతే విశ్వసనీయత దెబ్బతింటుందని కాంగ్రెస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
ఇదిలాఉండగా...ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోమారు ప్రధానమంత్రిపై కొత్త ఆరోపణలు చేశారు. నోట్లను రద్దుచేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వెనుక రూ.8000 కోట్ల కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు. ప్రధాని మోదీ విద్యావంతుడైతే ఈ నిర్ణయం తీసుకునే వారు కాదని మీడియాతో అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తక్షణం నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ నిజంగా డిగ్రీ కోర్సు పూర్తిచేస్తే వివరాలు బయటపెట్టేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/