Begin typing your search above and press return to search.
ఆ టాప్ లాయర్ కు భారీ షాకిచ్చిన సీఎం!
By: Tupaki Desk | 26 May 2017 11:57 AM GMTచట్టాల్ని చుట్టాల మాదిరి అలవోకగా చెప్పేసే సత్తా ఉన్న అతి కొద్ది మంది లాయర్లలో ఒకరు రాం జెఠ్మాలానీ. ఆయన కానీ కోర్టుకు వచ్చి వాదనలు వినిపిస్తున్నారంటే చాలు.. సీనియర్ న్యాయమూర్తులు సైతం ఆసక్తికరంగా ఆయన వాదనను వినేందుకు ఇష్టపడతారు. భారత రాజ్యాంగనిపుణుల్లో ఒకరిగా మాత్రమే కాదు.. గంటల చొప్పున ఫీజు వసూలు చేసే అతి కొద్ది మంది లాయర్లలో ఆయనొకరు.
కేసు టేకప్ చేస్తే కోటి.. కోర్టుకు వచ్చిన ప్రతిసారీ రూ.25లక్షల రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్ జెఠ్మాలానీ సొంతం. అలాంటి ఆయన కేసు వాదిస్తున్నారంటే ప్రముఖులు ముసుగుతన్ని ధైర్యంగా నిద్రపోతారు. అలాంటి జెఠ్మాలానీకి ఊహించని షాకిచ్చారు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.
ఢిల్లీ క్రికెట్ సంఘానికి సంబంధించిన పంచాయితీలో జైట్లీ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్.. ఆపై సారీ చెప్పకపోవటంతో ఆయనపై పరువునష్టం దావా వేశారు. అయితే.. ఈ కేసును కేజ్రీవాల్ తరఫున టేకప్ చేశారు రాం జెఠ్మాలానీ. కేసు విచారణ సందర్భంగా అనుకోని రీతిలో అనరాని మాట ఒకటి జెఠ్మాలానీ నోటి నుంచి రావటంతో దానిపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యపై కోర్టు సైతం హెచ్చరించింది. ఈ మాటను మీరే అన్నారా? మీ క్లయింట్ అనమంటే అన్నారా? అన్న ప్రశ్నను సంధించి మందలించింది. ఇదిలా ఉంటే.. ఈ వ్యాఖ్యపై సీఎం కేజ్రీవాల్ పై జైట్లీ మరో రూ.10కోట్ల పరువునష్టం దావా వేశారు.
కోర్టు హెచ్చరిక నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ ఊహించని నిర్ణయాన్ని తీసుకున్నారు. తన కేసును వాదిస్తున్న రాంజెఠ్మలానీని తప్పించారు. ఈ పరిణామం సంచలనంగా మారింది. జెఠ్మాలానీ లాంటి న్యాయకోవిదుడు కేసును వాదించేందుకు ఒప్పుకుంటేనే హ్యాపీగా ఫీలయ్యే పరిస్థితి ఉంటే.. అందుకు భిన్నంగా ఆయన్ను తన కేసును వాదించే విషయం నుంచి తప్పించటం ఇప్పుడు సంచలనంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/