Begin typing your search above and press return to search.
గాంధీ కుటుంబానికి 'చేయి'ఇచ్చిన అరవింద్ కేజ్రీవాల్
By: Tupaki Desk | 17 Feb 2020 11:15 AM GMTముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించి మరోసారి అధికారంలోకి వచ్చారు. అయితే ఈ ఫలితాలు వచ్చినప్పటి నుంచి అరవింద్ కేజ్రీవాల్ లో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. ఫలితాల ప్రకటన వరకు ఒకతీరుగా ఉన్న కేజ్రీవాల్ ఫలితాల వెల్లడి అనంతరం తన పద్ధతి మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలిచిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేజ్రీవాల్ కు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ ను చూసిన కేజ్రీవాల్ గతానికి భిన్నంగా స్పందించారు. మోదీతో సాన్నిహిత్యం కోరుతున్నట్లు ఆ ట్వీట్ ను చూస్తుంటే తెలుస్తోంది. అనంతరం ఆదివారం అట్టహాసంగా జరిగిన ప్రమాణస్వీకారానికి కేజ్రీవాల్ కేవలం ప్రధానమంత్రి నరేంద్రమోదీని మాత్రమే ఆహ్వానించారు. ప్రతిపక్ష నాయకులు, థర్డ్ ఫ్రంట్ నాయకులకు ఆహ్వానం పలుకుతారని అందరూ భావించగా కేజ్రీవాల్ దానికి విరుద్ధంగా నరేంద్ర మోదీకి మాత్రమే ఆహ్వానం అందించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఢిల్లీ ఎన్నికల్లో పరస్పరం విమర్శలు చేసుకున్న కేజ్రీవాల్, నరేంద్రమోదీ ఎన్నికల ఫలితాల అనంతరం మిత్రులుగా మారినట్టు తెలుస్తోంది. ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కేజ్రీవాల్ ను అభినందిస్తూ నరేంద్రమోదీ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. మీరు కూడా వచ్చి ఉంటే బాగుండేది. మీ పనుల వలన రాలేకపోయారని భావిస్తున్నా అని కేజ్రీవాల్ పేర్కొన్నాడు. ఈ ట్వీట్ ను చూసిన వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. గతానికి భిన్నంగా మోదీతో కేజ్రీవాల్ స్పందించారు. సానుకూల వైఖరితో స్పందించడం వెనుక కేంద్ర ప్రభుత్వం తో విబేధాలు వద్దు.. సాన్నిహిత్యం ముద్దు అన్నట్టు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే గతంలో కేంద్ర ప్రభుత్వంతో పేచీలు పెట్టుకుని కేజ్రీవాల్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గవర్నర్ జనరల్, ముఖ్యమంత్రికి మధ్య తీవ్ర పోరు సాగింది. దీంతో ఢిల్లీ పాలన కొంత స్తంభించింది. ఎందుకొచ్చిన పెంట అని ఇప్పటినుంచే కేంద్రంతో సానుకూలంగా ఉంటే రాష్ట్రానికి ఏమైనా మేలు చూకూరవచ్చనే ఉద్దేశం తో కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తో గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని దూరంగా పెడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ను కేజ్రీవాల్ బొత్తిగా పట్టించుకోవడం లేదు. కనీసం ఢిల్లీలోనే ఉండే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహూల్ గాంధీని ప్రమాణస్వీకారం కార్యక్రమానికి పిలవలేదు. ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీనే విమర్శలు చేసినా ఆ తర్వాత కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ ప్రచారం చేశారు. గతంతో పోలిస్తే గాంధీ కుటుంబానికి కేజ్రీవాల్ దూరం కావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆ పార్టీతో వచ్చిదేమీ లేదు.. పోయేదేమీ లేదనే అభిప్రాయం లో ఉన్నట్లు పరిణామాలు జరుగుతున్నాయి.