Begin typing your search above and press return to search.

మోడీ ఇలాకా జోలికి పోవ‌ద్దంటున్న ఆ సీఎం

By:  Tupaki Desk   |   9 July 2017 5:41 AM GMT
మోడీ ఇలాకా జోలికి పోవ‌ద్దంటున్న ఆ సీఎం
X
దేశంలో చాలామంది ముఖ్య‌మంత్రులు ఉన్నా ఢిల్లీ ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆమ్ ఆద్మీ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్ తీరు పూర్తి భిన్నం. రాజ‌కీయంగా ఆయ‌న తీసుకునే నిర్ణ‌యాలు ఒక ప‌ట్టాన అర్థ‌మే కావు. ఎప్పుడెలా వ్య‌వ‌హ‌రిస్తారో.. ఎలాంటి నిర్ణ‌యాల్ని ప్ర‌క‌టిస్తారో.. ఎందుక‌లాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో ఎవ‌రికీ తెలీదు. పేరుకు పార్టీ నిర్ణ‌యంగా చెప్పినా.. కీల‌క నిర్ణ‌యాల‌న్ని త‌న‌కు తోచిన రీతిలో తీసుకుంటార‌న్న విమ‌ర్శ ఉంది.

ఆ మ‌ధ్య వ‌ర‌కూ ప్ర‌తి విష‌యానికి నేనున్నానంటూ చెల‌రేగిపోయే ఆయ‌న‌.. ఢిల్లీ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా తాను చేయాల్సిన ప‌నుల్ని వ‌దిలేసి మ‌రీ జాతీయ రాజ‌కీయాల మీద త‌ర‌చూ స్పందిస్తుంటారు. ప్ర‌ధాని మోడీ అంటే అస్స‌లు ఇష్ట‌ప‌డ‌ని కేజ్రీవాల్‌.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే స‌ర్కారుపై యుద్ధ‌మే ప్ర‌క‌టించారు.

అయితే.. అనాలోచితంగా ఆయ‌న తీసుకున్న ప‌లు నిర్ణ‌యాలు కేజ్రీవాల్‌ ను ఓట‌మికి ద‌గ్గ‌ర‌య్యేలా చేశాయి. ప‌లు రాష్ట్రాల ఎన్నిక‌ల బ‌రిలో దిగి అప‌జయాల్ని కొని తెచ్చుకుంటూ జాతీయ స్థాయిలో త‌న‌కున్న ప‌లుకుబ‌డిని ప‌లుచ‌న చేసుకున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఢిల్లీ ఎన్నిక‌ల్లో ఎవ‌రూ ఊహించ‌ని విజ‌యాన్ని సొంతం చేసుకున్నా.. ఈ మ‌ధ్య‌న నిర్వ‌హించిన ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో అధికార‌పార్టీగా ఉన్న ఆమ్ ఆద్మీకి కోలుకోలేని దెబ్బ త‌గిలింది.

దీంతో.. జాతీయ స్థాయి అంశాల మీద ఫోక‌స్‌ను త‌గ్గించి సీఎం కే్జ్రీవాల్‌.. ఢిల్లీ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి మీదా.. పాల‌న మీదా దృష్టి మ‌రింత పెంచిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే కొద్ది నెల‌లుగా ఆయ‌న వార్త‌ల్లో క‌నిపించ‌కుండా పోయార‌ని చెప్పాలి. తాజాగా ఆయ‌న మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు. ఈసారి ఆయ‌న వార్త‌ల్లోకి రావ‌టానికి కార‌ణం కాస్తంత చిత్ర‌మైన‌దిగా చెప్ప‌క త‌ప్ప‌దు.

మోడీ అంటే విరుచుకుప‌డ‌ట‌మే కాదు.. ఆయ‌న్ను దెబ్బ తీయ‌ట‌మే త‌న ప్ర‌ధాన ల‌క్ష్యంగా కేజ్రీవాల్ వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఇందులో భాగంగానే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వార‌ణాసి బ‌రిలో దిగిన మోడీపై ఆయ‌న పోటీ చేశారు. అయితే.. ఓట‌మి చెంద‌టం వేరే విష‌యం. ఇలా మోడీని ఇరుకున పెట్టే ఏ అంశాన్ని ఆయ‌న వ‌దిలిపెట్ట‌లేదు. ఇంతా చేస్తే.. కేజ్రీవాల్ కు ఏదో ర‌కంగా ఎదురుదెబ్బ త‌గిలిందే త‌ప్పించి.. మోడీ మీద పైచేయి సాధించ‌లేక‌పోయారు.

ఇదిలా ఉంటే.. మ‌రికొద్ది నెల‌ల్లో గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వ‌రుస‌గా విజ‌యం సాధిస్తూ.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్టేందుకు వీలుగా.. ఆ రాష్ట్ర ఎన్నిక‌ల్లో కేజ్రీవాల్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నార‌న్న వాద‌న వినిపించింది. ఇందుకు భిన్నంగా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం షాకింగ్ గా మారింది. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పోటీ చేయ‌కూడ‌ద‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ నిర్ణ‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించ‌లేదు. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఆమ్ ఆద్మీ పార్టీ దూరంగా ఉండాల‌ని భావిస్తున్న వార్త ఇప్పుడా పార్టీలో కొత్త దుమారాన్ని రేపుతోంది.

ఈ మ‌ధ్య‌నే జ‌రిగిన పంజాబ్‌.. గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎదురైన ఓట‌మి నేప‌థ్యంలో.. మోడీ ఇలాకా అయిన గుజ‌రాత్ రాష్ట్ర అసెంబ్లీ బ‌రిలో దిగ‌కుండా ఉండ‌ట‌మే ఉత్త‌మం అన్న భావ‌న‌లో కేజ్రీవాల్ ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. దీనిపై పార్టీ నేత‌లు మాత్రం గుర్రుగా ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఇటీవ‌ల గుజ‌రాత్‌ పార్టీ నేత‌లు కేజ్రీవాల్‌ కు ఒక ప్ర‌జంటేష‌న్ ఇచ్చార‌ని.. ఎన్నిక‌ల గోదాలోకి దిగాలా? వ‌ద్దా? అన్న‌ది ఇంకా తేల్చుకోలేక‌పోతున్నార‌ని చెబుతున్నారు. అయితే.. పోటీకి దూరంగా ఉండాల‌న్న ఆలోచ‌న‌లోనే కేజ్రీవాల్ ఉన్నార‌ని..ఈ నిర్ణ‌యాన్ని ఆమ్ ఆద్మీ నేత‌లు.. కార్య‌క‌ర్త‌లకు మింగుడుప‌డ‌టం లేద‌ని తెలుస్తోంది. గుజ‌రాత్ ఎన్నిక‌ల బ‌రిలో దిగితే ఓట‌మి ఖాయ‌మ‌న్న‌ది కేజ్రీవాల్ భావ‌న అని.. అందుకే ఆయ‌న పోరుకు దూరంగా ఉండాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఏమైనా.. గుజ‌రాత్ రాష్ట్ర ఎన్నిక‌లు కేజ్రీవాల్ కు పెద్ద త‌ల‌నొప్పిగా మారాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.