Begin typing your search above and press return to search.

కేజ్రీని చంపించేందుకు సిద్ధ‌మైన మోడీ!

By:  Tupaki Desk   |   27 July 2016 4:18 PM GMT
కేజ్రీని చంపించేందుకు సిద్ధ‌మైన మోడీ!
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోప‌ణ‌లు చేశారు. ఈ ద‌ఫా కేజ్రీవాల్ రాజ‌కీయ ఆరోప‌ణ‌లు కాకుండా ఏకంగా హ‌త్యా వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లంగా మారింది. ఇటీవ‌ల ప‌లువురు ఆమ్ ఆద్మీ పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు అరెస్ట‌యిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో స‌ద‌రు అరెస్టుల‌ను ప్ర‌స్తావిస్తూ ఆప్ నాయ‌కుల‌ ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును ఆయ‌న తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ఈ మేర‌కు కేజ్రివాల్‌ వీడియో సందేశం విడుద‌ల చేశారు.

ఆ వీడియో మెసేజ్‌ లో కేజ్రీ త‌న‌ సందేశాన్ని వినిపిస్తూ...త‌న పార్టీ మీద ఉన్న క‌క్ష్య‌తో ప్ర‌ధాని మోడీ త‌నను చంపిస్తాడేమో అని కేజ్రీవాల్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆప్ ఎమ్మెల్యేల‌పై మోదీ ప్ర‌తీకారం తీర్చుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. ''మోదీ నాయ‌కత్వంలో దేశం సుర‌క్షితంగా ఉంద‌నుకోవ‌డం లేదు. ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోడీ చాలా తీవ్ర నిరాశ‌ - నిస్పృహ‌లో ఉన్నారు. ఆయ‌న న‌న్ను చంపించినా ఆశ్చ‌ర్యం లేదు'' అని కేజ్రీ అన్నారు. అందుకే ప్ర‌తి ఆప్ కార్య‌క‌ర్త జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాల‌ని సూచించారు. ప్ర‌తీకారంతో ఉన్న మోదీ ఆప్ కార్య‌క‌ర్త‌ల‌ను చంపినా చంపిస్తారనే సందేహాలు వెలువ‌డుతున్నాయ‌ని కేజ్రీవాల్ సూచించారు. అయితే ప్రాణాలు పోతాయ‌ని భ‌యం ఉన్న వాళ్లు పార్టీని వ‌దిలి వెళ్లాల‌ని లేదంటే ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌న్నారు. యూట్యూబ్‌ లో విడుద‌ల చేసిన వీడియోలో కేజ్రీ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ఇపుడు క‌ల‌క‌లం సృష్టిస్తోంది.