Begin typing your search above and press return to search.
అదేం ఖర్మో.. ఆ సీఎం చెంప ఛెళ్లుమనిపించాడు!
By: Tupaki Desk | 5 May 2019 5:40 AM GMTదేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు. అలాంటి వారెవరికీ ఎదురుకాని దారుణమైన అనుభవాలన్నీ ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు తరచూ ఎదురవుతూ ఉంటాయి. ముఖం మీద ఇంకు మరకలు కావొచ్చు.. చెప్పులు విసిరేయటం.. గుడ్లు విసిరే ప్రయత్నం చేయటం.. చివరకు చెంప ఛెళ్లుమనిపించే వరకూ వెళ్లింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.
ఢిల్లీలోని మోతీనగర్ లో శనివారం కేజ్రీవాల్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఓపెన్ టాప్ జీవులో రోడ్ షో చేస్తున్న ఆయన.. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రశాంత వాతావరణంలో సాగుతున్న కేజ్రీవాల్ ర్యాలీలో అనుకోని పరిణామం చోటు చేసుకుంది. రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఒకరు అనూహ్యంగా వాహనం మీదకు దూసుకొచ్చి.. సీఎం చెంప ఛెళ్లుమనిపించారు.
ఊహించని ఈ పరిణామంతో కేజ్రీవాల్ త్రోటుపాటుకు గురయ్యారు. దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకొన్న కేజ్రీవాల్ అభిమానులు అతన్ని పట్టుకొని కొట్టారు. ఢిల్లీ సీఎం చెంప ఛెళ్లుమనిపంచిన వ్యక్తిని 33 ఏళ్ల సురేశ్ గా గుర్తించారు.అతడు వాహనాల స్పేర్ పార్ట్స్ డీలర్ గా గుర్తించారు. సీఎంపై దాడి జరిపిన ఉదంతంపై అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ ఉదంతం వెనువెంటనే రాజకీయ రంగు పులుముకుంది.
ఈ ఘటన వెనుక బీజేపీ హస్తం ఉందని.. పక్కా ప్లాన్ తోనే పార్టీ నేతలు ఈ పని చేయించారని ఆప్ ఆరోపించింది. కేజ్రీవాల్ ను ఎదుర్కొనే ధైర్యం లేక భౌతికదాడులకు పాల్పడిందని మండిపడ్డారు. ఈ దాడి వెనుక ప్రధాని మోడీ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల హస్తం ఉన్నట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తప్పు పట్టారు. పలు విపక్షాలు కేజ్రీవాల్ పై దాడి వెనుక బీజేపీ కుట్ర ఉందన్నారు. ఆమ్ ఆద్మీ సీఎంగా పేరున్న కేజ్రీవాల్ కు ఇలాంటి చేదు అనుభవాలు పదే పదే ఎదురవుతుంటాయి? నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్లు?