Begin typing your search above and press return to search.

దీపావళి వేళ.. ఆ సీఎం వినూత్న ప్రోగ్రాం.. ఇంతకూ అదేమంటే?

By:  Tupaki Desk   |   15 Nov 2020 1:30 AM GMT
దీపావళి వేళ.. ఆ సీఎం వినూత్న ప్రోగ్రాం.. ఇంతకూ అదేమంటే?
X
కరోనా వేళ వచ్చిన దీపావళి వేళ.. టపాసులు కాలిస్తే.. ఏదేదో అయిపోతుందని. .కాలుష్యం కారణంగా కేసుల తీవ్రత మరింత పెరిగిపోతుందని ఆందోళన చెందుతున్న నేతలు పలువురు ఉన్నారు. ఆ జాబితాలోకి వస్తారు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. కరోనా కారణంగా చీకట్లు కమ్మిన ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు తెచ్చేందుకు దీపావళి వేళ.. ప్రజలు టపాసులు కాల్చే విషయం మీద పెద్దగా ఫోకస్ పెట్టకుండా ఉండేందుకు వీలుగా ఢిల్లీ రాష్ట్ర సీఎం వినూత్నంగా ప్లాన్ చేశారు.

తన కేబినెట్ మంత్రులతో కలిసి అక్షరధామ్ లో శనివారం రాత్రి 7.39 గంటలకు లక్ష్మీ పూజ చేయాలని డిసైడ్ చేశారు. ఈ పూజను టీవీల్లో లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. ఈ విషయాన్ని సీఎం వెల్లడిస్తూ.. పూజలో రాష్ట్ర ప్రజలంతా పాల్గొనాలని కోరుతున్నారు. అందరం కలిసి పూజ చేయటం ద్వారా.. కష్టాల్ని పారద్రోలుదామని ఆయన పిలుపునిస్తున్నారు. సీఎం చెప్పిన టైంలో అందరూ టపాసులు కాల్చే పనిలో బిజీగా ఉంటారు.

ఆ పని నుంచి తప్పించటానికి వీలుగా లక్ష్మీపూజ కార్యక్రమాన్ని తెర మీదకు తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. టపాసులు వదిలేసి.. పూజలో పాల్గొంటే.. ఆటోమేటిక్ గా కాలుష్యం తీవ్రత తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉండటంతో దేశ రాజధాని ఢిల్లీలో నవంబరు 30 వరకు ఎలాంటి బాణసంచా కాల్చకుండా బ్యాన్ విధించారు. ప్రతి పోలీస్ స్టేషన్ కు ఒక ప్లైయింగ్ స్కాడ్ ని నియమించారు.