Begin typing your search above and press return to search.

బీజేపీపై బాబు విసిరిన ఆర్థిక వేత్త

By:  Tupaki Desk   |   29 Nov 2018 11:21 AM GMT
బీజేపీపై బాబు విసిరిన ఆర్థిక వేత్త
X
పెద్ద నోట్ల రద్దు.. దీనివల్ల ఎంత మంది డబ్బుల కోసం బ్యాంకుల ఎదుట క్యూలు కట్టారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ధనిక, పేద అనే తేడా లేకుండా అందరూ పెద్ద నోట్ల రద్దు వల్ల ఇబ్బంది పడ్డవారే.. ప్రధాని మోడీ - బీజేపీ నేతలు మాత్రం దీన్ని ఒక ఆర్థిక సంస్కరణగా.. దేశాన్ని ఉద్దరించినమన్నట్లు ఇప్పటికీ చెబుతుంటారు. దీనిపై ప్రతిపక్షాలు - మాజీ ఆర్థిక మంత్రులు సహా పలువురు ఆర్థిక నిపుణులు తప్పు అని చెప్పినా బీజేపీ వారి చెవికెక్కడం లేదు..

తాజాగా బీజేపీకి అదిరిపోయే షాక్ తగిలింది. ప్రఖ్యాత ఆర్థిక వేత్త అరవింద్ సుబ్రమణియన్ బాంబు పేల్చారు. నోట్ల రద్దుకు ముందు దేశ జీడీపీ 8శాతంగా ఉండేదని.. తాజాగా నోట్ల రద్దు తర్వాత దేశ త్రైమాసిక జీడీపీ 6.8 శాతానికి పడిపోయిందని ఆయన లెక్కలతో సహా వివరించారు.

పెద్ద నోట్ల రద్దుపై ఎట్టకేలకు ఈ మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ బహిరంగంగా ప్రకటించడం బీజేపీని ఇరుకున పెట్టింది. పెద్ద నోట్ల రద్దును ఆయన ‘భారీ, క్రూరమైన, ద్రవ్యపరమైన షాక్’గా పేర్కొన్నారు. చలామణీలో ఉన్న 80శాతం కరెన్సీని బీజేపీ సర్కారు రద్దు చేయడంతో దేశ ఆర్థిక వృద్ధి పడిపోయిందని అరవింద్ సంచలన విషయాలు వెల్లడించారు. ఈ మేరకు డిసెంబర్ 5న ఒక పుస్తకాన్ని కూడా రిలీజ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ‘ఆఫ్ కౌన్సిల్: ది ఛాలెంజస్ ఆఫ్ ది మోడీ-జైట్లీ ఎకానమీ’’ అనే పుస్తకంలో పెద్ద నోట్ల వద్ల జరిగిన నష్టాన్ని వివరిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ పుస్తకం రిలీజ్ అయ్యి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందనేది వేచిచూడాల్సిందే..