Begin typing your search above and press return to search.

మేయర్ గా 21 ఏళ్ల బీఎస్సీ విద్యార్థిని .. దేశంలోనే మరో రికార్డ్!

By:  Tupaki Desk   |   25 Dec 2020 1:30 PM GMT
మేయర్ గా 21 ఏళ్ల బీఎస్సీ విద్యార్థిని .. దేశంలోనే మరో రికార్డ్!
X
ఈ మద్యే జరిగిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫంట్‌ (ఎల్డీఎఫ్‌) విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 941 స్థానాలకు గాను ఎల్డీఎఫ్ 516పైగా స్థానాల్లో విజయం సాధించి తమ పూర్తి ఆధిక్యతను కనబర్చింది. ఈ ఎన్నికల్లో 21 ఏళ్ల ఆర్యా రాజేంద్రన్‌ విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్శించారు. తాజా ఎన్నికల్లో విజయం సాధించిన అతిపిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. విపక్ష కూటమి నుంచి సీనియర్‌ అభ్యర్థి బరిలో నిలిచినప్పటికీ ఆమె విజయాన్ని అడ్డుకోలేకపోయారు.

ఈ ఎన్నికల్లో ముదవణ్ముగల్ వార్డు నుంచి సీపీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆర్య.. యూడీఎఫ్‌ అభ్యర్థిపై 2,872 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.. తిరువనంతపురంలో ఆల్ సెయింట్స్ కాలేజీలో ప్రస్తుతం బీఎస్సీ మ్యాథ్స్ రెండవ సంవత్సరం విద్యార్థిని. అంతేకాకుండా స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ ఎఫ్‌ ఐ) రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ వ్యవహారాల్లోనూ ఆర్య కీలకంగా పాత్ర పోషిస్తున్నారు. తిరువనంతపురం భారత దేశంలోనే 100 శాతం అక్షరాస్యత నమోదు చేసిన ప్రాంతంగా రికార్డు సృష్టించింది. ఆ నగరానికి ఇప్పుడు 21 ఏళ్ల బీఎస్సీ విద్యార్థిని ఆర్య రాజేంద్రన్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.

ఇక, ఎన్నికల ఫలితాల తర్వాత ఇవాళ సమావేశమైన సిపిఎం జిల్లా కార్యదర్శవర్గం.. ఏకగ్రీవంగా తిరువనంతపురం మేయర్‌ గా ఆర్య రాజేంద్రన్ పేరు ఖరారు చేసింది. మరో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు మేయర్‌ రేస్‌ లో ఉన్నా 21 ఏళ్ల ఆర్య వైపే మొగ్గు చూపింది సీపీఎం. మేయర్‌గా తన పేరును ఖరారు చేయడంపై స్పందించిన ఆర్య ఈ పదవికి సంబంధించి పార్టీ నుండి ఇంతవరకు తనకు ఎలాంటి సమాచారం రాలేదని, తనకు ఇచ్చిన ఏ బాధ్యతను అయినా సంతోషంగా స్వీకరిస్తానని ఈ సందర్భంగా వెల్లడించింది.. నేను ప్రస్తుతం కౌన్సిలర్‌గా పనిచేస్తున్నాను.. కానీ, పార్టీ నాకు ఇచ్చిన బాధ్యతలను కష్టమైనా నిర్వహిస్తానని ప్రకటించారు. మొత్తంగా కేరళలో అతి పిన్న వయస్సు మేయర్ ‌గా రికార్డు కెక్కబోతున్నారు.