Begin typing your search above and press return to search.
హీరోయిన్ తో ఆర్యన్ డ్రగ్స్ చాటింగ్: ఎన్సీబీ
By: Tupaki Desk | 20 Oct 2021 12:23 PM GMTమన గురించి తెలియాలంటే మన ఫోన్ చూస్తే అంతా అర్థమవుతుంది. మన పని ఏంటి? రోజూ ఏం చేస్తున్నాం.. ఎవరితో లావాదేవీలు జరుపుతాం.. మన కథ అంతా అందులో ముడిపడి ఉంటుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా ఇప్పుడు ఇదే తంతు.. తాజాగా బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ సైతం ఇలాగే దొరికిపోయాడు.
ముంబై టు గోవా వెళుతున్న క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ పార్టీలో దొరికిపోయిన షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఎన్సీబీ ఈ కేసును విచారణ జరుపుతోంది. ఆర్యన్ ఖాన్ ఫోన్ ను ఎన్సీబీ స్వాధీనం చేసుకోవడంతో అతడి గుట్టు అంతా బయటపడుతోంది. ఈ మేరకు ఆర్యన్ ఖాన్ ఇప్పుడు సెల్ ఫోన్ తో బుక్కైపోయారు.
క్రూయిజ్ షిప్ లో ఆర్యన్ ఖాన్ వద్ద ఎటువంటి డ్రగ్స్ దొరకలేదు. అయితే అతడి స్నేహితుల వద్ద దొరికాయి. వాటిని ఆర్యన్ వాడాడు. వాడుతుంటాడు కూడా అని ఎన్సీబీ అభియోగం మోపింది. అయితే దానికి ఆధారాలు దొరికింది లేదు.
తాజాగా ఆర్యన్ ఖాన్ ఫోన్ ను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఎన్సీబీ ఈ వాదనను వినిపిస్తూ వస్తోంది. ఆర్యన్ ఖాన్ ఫోన్ లో డ్రగ్స్ గురించి చాట్ చేశాడని.. దీన్ని బట్టి అతడికి అలవాటు ఉందని.. అలాగే డ్రగ్స్ సరఫరాదారులతో ఆర్యన్ కాన్ చాట్ చేశాడని ఎన్సీబీ వాదిస్తోంది. దీని గుట్టు అంతా బయటకు తీసే వరకూ ఆర్యన్ కు బెయిల్ ఇవ్వరాదని అంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆర్యన్ ఖాన్ కు కోర్టు బెయిల్ నిరాకరించినట్టు తెలిసింది.
ఇక ఫోన్ చాటింగ్ లో ఆర్యన్ ఖాన్ ఒక బాలీవుడ్ వర్తమాన హీరోయిన్ తో డ్రగ్స్ గురించి వాట్సాప్ లో చాట్ చేశాడని ఎన్సీబీ కోర్టుకు వివరిస్తోందట.. అందుకు సంబంధించి వారి వాట్సాప్ చాట్ సారాంశాన్ని కోర్టు ముందు ఉంచి ఈసాయి బెయిల్ కు నో చెప్పించాలని ఎన్సీబీ గట్టిగా వాదించలనుందని తెలుస్తోంది.