Begin typing your search above and press return to search.

ఆర్యన్ ఖాన్ ఎపిసోడ్.. బీజేపీ వర్సెస్ ఎన్సీపీగా మారిందా?

By:  Tupaki Desk   |   7 Nov 2021 12:30 PM GMT
ఆర్యన్ ఖాన్ ఎపిసోడ్.. బీజేపీ వర్సెస్ ఎన్సీపీగా మారిందా?
X
అనూహ్యంగా తెర మీదకు వచ్చిన బాలీవుడ్ బాద్షా షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ ఎపిసోడ్ లో అనూహ్యమైన ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. గోవాలో జరిగే పార్టీకి బయలుదేరిన విలాసవంతమైన క్రూయిజ్ పై ఎన్ సీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించటం.. ఆర్యన్ ఖాన్ తో పాటు.. మరికొందరు బిగ్ షాట్ పిల్లల్ని అదుపులోకి తీసుకొని.. వారి నుంచి నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవటం తెలిసిందే. అనంతరం వారు జైలుకు తరలించటం..ఈ మధ్యనే కోర్టు బెయిల్ ఇవ్వటం తెలిసిందే.

రోజులు గడిచే కొద్దీ ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ ఎపిసోడ్ లో అనూహ్యమైన ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ బీసీ అధికారి సమీర్ వాంఖడేను తప్పించటం.. ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణల్ని మహారాష్ట్ర అధికారపక్ష భాగస్వామి అయిన ఎన్సీపీ నేత సంధించటం.. ఆయనపై అవినీతి ఆరోపణల్ని చేయటం తెలిసిందే. దీంతో.. మొన్నటి వరకు సంచలన కేసుకు విచారణ అధికారిగా ఉన్న ఆయన.. ఇప్పుడు తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన పరిస్థితి. కెరీర్ లో ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్న వాంఖడే లాంటి అధికారికి సైతం.. తాజాగా తనకు ఎదురవుతున్న అనుభవాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆరోపణల నుంచి బయటపడటం ఆయనకో పెద్ద సవాలుగా మారినట్లుగా తెలుస్తోంది.

ఇలాంటి వేళలోనే.. ఆయన నుంచి ఆర్యన్ డ్రగ్స్ కేసును విడదీసి.. ఢిల్లీకి బదిలీ చేయటం.. సంజయ్ కుమార్ సింగ్ కు అప్పజెప్పటం తెలిసిందే. ఇటీవల కాలంలో షారుక్ అండ్ కోకు అండగా నిలిచినట్లుగా వ్యాఖ్యలు వినిపిస్తున్న ఎన్సీపీ నేత కమ్ మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ కు భారీ కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీ నేత ఒకరు బయటకు వచ్చారు. తాజాగా మొదలైన పరిణామాన్ని చూస్తే.. ఆర్యన్ ఖాన్ ఎపిసోడ్ తిరిగి..తిరిగి మహారాష్ట్ర అధికార పక్షం వర్సెస్ ప్రదాన ప్రతిపక్షం మధ్య పోరుగా మారినట్లుగా చెప్పాలి. ఈ వాదనకు బలం చేకూరేలా తాజాగా కొన్ని సంచలన ఆరోపణల్ని బీజేపీ నేత మోహిత్ కంబోజ్ సంధిస్తున్నారు. సంచలనంగా.. అంతకు మించి పెను రాజకీయ దుమారంగా మారే అవకాశం ఉన్న ఈ ఆరోపణల్ని చూస్తే..

- కొందరు మంత్రులు షారుక్ ఖాన్ నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో అధికార ఎన్సీపీకి సంబంధాలు ఉన్నాయి. ముంబయి క్రూజ్ డ్రగ్స్ కేసులో ఎన్సీపీ నేత సునీల్ పాటిల్ ఒక కీలక సూత్రధారి. అతడికి మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ తో పాటు అనేక మంది నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

- డ్రగ్ వ్యాపారి.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సన్నిహితుడైన చింకూ పఠాన్ ను లాక్ డౌన్ వేళ.. అనిల్ దేశ్ ముఖ్ సహ్యాద్రి రాష్ట్ర గెస్టు హౌస్ లో ఎందుకు కలిశారు?

- డ్రగ్స్ కేసులో ఎన్ బీసీ సాక్షిగా ఉన్న కిరణ్ గోసావి సునీల్ పాటిల్ సహచరుడే. క్రూజ్ లో తనిఖీలు చేయటానికి ముందు అంటే అక్టోబరు ఒకటి వరకు శామ్ డిసౌజా.. గోసావిలతో సునీల్ పాటిల్ టచ్ లోనే ఉన్నారు.

- క్రూజ్ నౌక డ్రగ్స్ కేసు కుట్రలో మాస్టర్ మైండ్ సునీల్ పాటిలే. అతడు అనిల్ దేశ్ ముఖ్ కుమారుడికి మంచి స్నేహితుడు. 1999-2014 వరకు.. అలానే 2019లోనూ మహా వికాస్ అఘాడీ కూటమి సర్కారు వచ్చాక సునీల్ పాటిల్ ఉద్యోగుల బదిలీల్లో కీలక భూమిక పోషించేవారు.

- సహ్యాద్రి గెస్టు హౌస్ లో దావూద్ అనుచరుడితో అనిల్ దేశ్ ముఖ్ బేటీ ఫోటోలకు సమాధానం ఏం చెబుతారు?