Begin typing your search above and press return to search.
మాఫియా డాన్ లు.. తీవ్రవాదుల్ని వేసే జైల్లో షారూక్ వారసుడు..?
By: Tupaki Desk | 9 Oct 2021 5:34 AM GMTకింగ్ ఖాన్ షారూక్ వారసుడు ఆర్యన్ ఖాన్ ని డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఎన్.సి.బి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ ను ముంబై కోర్టు శుక్రవారం తిరస్కరించింది. సహ నిందితులు మున్మున్ ధమేచా - అర్బాజ్ మర్చంట్ బెయిల్ పిటిషన్లను కూడా కోర్టు తిరస్కరించింది. ముంబై నుండి గోవా వెళ్లే క్రూయిజ్ షిప్ పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దాడి చేసిన తర్వాత అక్టోబర్ 3 న వారిని అరెస్టు చేశారు. వారి బెయిల్ పిటీషన్లను తిరస్కరించడంతో.. ఆర్యన్ ఖాన్ .. ఇతర నిందితులు ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉంటారు. ఆర్యన్ ఖాన్ కు ప్రత్యేక ట్రీట్ ఏదీ ఇవ్వరు. ఇతర అండర్-ట్రయల్ ఖైదీలలాగే ఏర్పాట్లు ఉంటాయి మినహా అదనపు సౌకర్యాలు ఇవ్వరు.
అంతేకాదు.. ముంబైలో అత్యంత దుర్భేధ్యమైన జైల్లో తీవ్రవాదులు మాఫియా వాళ్లు ఉండే చోటికి ఆర్యన్ ని తరలించడం చర్చకు వచ్చింది. ఒకప్పుడు సంజయ్ దత్- పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్- ముంబై మాఫియా డాన్ లు చోటా రాజన్- అబూ సలేం ఉండే ఆర్యన్ ఖాన్ జైలులో ఉండాల్సి ఉంటుంది.
ఆర్థర్ రోడ్ జైలుగా ప్రసిద్ధి చెందిన ముంబై సెంట్రల్ జైలు 1926 లో నిర్మించబడింది. ఇది ముంబైలోని అతి పెద్ద పురాతన జైలు. ఈ జైలు 2 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. 1972 లో దీనిని సెంట్రల్ జైలుగా ప్రకటించారు. ఈ జైలు మొదట 800 మంది ఖైదీలకు వసతి కల్పించడానికి నిర్మించినా.. ఈ స్థలం రద్దీగా మారుతోందని నివేదనలు ఉన్నాయి. 2021 లో ఎనిమిది కొత్త బ్యారక్ లు జోడించారు. 200 మంది అదనపు ఖైదీలను ఉంచే ఏర్పాటును ఇక్కడ చేశారు.
ఈ జైలులో పలువురు ప్రముఖుల వివరాలను పరిశీలిస్తే..1993 బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ జైలు పాలయ్యారు. అతడిని అబూ జుందాల్ ఉంచిన అండా సెల్ (సెంట్రల్ జైల్) సమీపంలో ఉన్న హై సెక్యూరిటీ సెల్ లో ఉంచారు. అలాగే అజ్మల్ కసబ్ ఇక్కడే ఉన్నాడు. ముంబైపై 26/11 దాడుల సమయంలో సజీవంగా పట్టుబడిన పాకిస్తాన్ ప్రేరేపిత ఏకైక ఉగ్రవాది అతను. నవంబర్ 2012 లో కసబ్ ను పూణేలోని ఎరవాడ జైలులో ఉరితీశారు. ముంబై డాన్ చోటా రాజన్ ఊచలు లెక్కించింది ఇక్కడే. అతను తాత్కాలికంగా ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నాడు. అతను ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు. దాదాపు 7 కేసులలో విచారణ కోసం వేచి ఉన్నాడు. మరో ముంబై మాఫియా డాన్
అబూ సలేం ని ఇక్కడ ఎక్కువ కాలం ఉంచారు. అతను 1993 బాంబు పేలుడు కేసులో దోషి. గ్యాంగ్ స్టర్ ముస్తఫా దోస్సా అతనిపై ఆర్థర్ రోడ్ జైలులో దాడి చేయడంతో అతడిని తరువాత తలోజా జైలుకు తరలించారు.
ఇంకా కోలుకోని షారూక్..!
షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. అజేయమైన కింగ్ ఖాన్ కొడుకు డ్రగ్ కేసులో రేవ్ పార్టీలో పట్టుబడ్డాడు. అరెస్టు అయ్యాడు. ప్రస్తుతం ED అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈ సమస్య SRK గౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. అతను అతఃహశుడయ్యారని తెలిసింది. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు. ఆప్తులు ప్రియమైన వారితో మాటా మంతీ కూడా కట్ చేశారని తెలిసింది. తన నివాసంలో తనను సందర్శించవద్దని అతను తన స్నేహితులను కూడా కోరాడు. టాక్ ఏమిటంటే... SRK గదిలో బందీ అయ్యి బయటకు వచ్చేందుకు ఆసక్తిగా లేరని కథనాలొచ్చాయి. ఇప్పటివరకు ఎవరితోనూ సంభాషించడానికి సిద్ధంగా లేడని తెలిసింది.
అతను ఎదుర్కొంటున్న ఒత్తిడి కారణంగా SRK కూడా గత కొన్ని రోజులుగా తన షూటింగులకు దూరమయ్యాడు. ఈ వార్త బయటకు వచ్చినప్పుడు అతను పఠాన్ పాట చిత్రీకరణ కోసం స్పెయిన్ కు విదేశాలకు వెళ్లబోతున్నాడు. కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. మీడియా కూడా దీనికి మంచి హైప్ ఇస్తోంది. ఆర్యన్ బెయిల్ మీద ఎప్పుడు విడుదల అవుతాడో చూడాలి.