Begin typing your search above and press return to search.
ఎట్టకేలకు బయటకొచ్చిన ఆర్యన్ ఖాన్..
By: Tupaki Desk | 30 Oct 2021 6:40 AM GMTముంబై క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ కేసులో పట్టుబడిన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఎట్టకేలకు విడుదలయ్యాడు. ఈ డ్రగ్స్ కేసు బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుచగా రిమాండ్ విధించింది. అప్పటి నుంచి ఆర్యన్ విడుదల కోసం ముమ్మర ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆర్యన్ ఖాన్ కు గురువారం బెయిల్ లభించింది.
బెయిల్ ప్రక్రియ ఆలస్యం కావడంతో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ శనివారం ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ కేసులో గురువారమే ఆర్యన్ కు బెయిల్ లభించినప్పటికీ విడుదల ప్రక్రియ ఆలస్యం కావడంతో శనివారం ఉదయం జైలు నుంచి బయటకు బయటకు వచ్చాడు.
ఇక తన కుమారుడు ఆర్యన్ ను జైలు నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు స్వయంగా తండ్రి షారుఖ్ ఖాన్, ఆయన సతీమణి గౌరీఖాన్ ఆర్థర్ రోడ్డు జైలుకు వచ్చారు. ఈ కేసులో అరెస్ట్ అయిన 28 రోజుల తర్వాత తిరిగి ఆర్యన్ తన కుటుంబాన్ని కలుసుకున్నాడు.
డ్రగ్స్ కేసులో ఆర్యన్ కు ముంబై హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. అయితే దీనికి సంబంధించి పూర్తి ఉత్తర్వులు నిన్న జారీ చేసింది. కానీ అవి సకాలంలో జైలుకు చేరలేదు. విడుదల ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఆర్యన్ శుక్రవారం రాత్రి కూడా జైల్లో ఉండక తప్పలేదు. శనివారం ఉదయం కోర్టు ఉత్తర్వులను పరిశీలించిన జైలు సిబ్బంది ఆర్యన్ ను విడుదల చేశారు.
ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ పై బాంబే హైకోర్టులో మూడు రోజులు సుధీర్ఘ వాదనలు కొనసాగాయి. ఆర్యన్ ఖాన్ తరుఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించి బెయిల్ వచ్చేలా చేశారు. ముకుల్ రోహత్గీ బలమైన అంశాలను లేవనెత్తడంతోనే ఎన్సీబీ వాదన వీగిపోయి బెయిల్ వచ్చింది. లాజిక్ తో ముకుల్ రోహత్గీ కొట్టేశాడు.
డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అక్టోబర్ 3న అరెస్టు చేసిన షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో షారుఖ్ ఖాన్ నివాసం ‘మన్నత్’ ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. షారుఖ్ ఖాన్ అభిమానులు పండుగ చేసుకున్నారు. తన కొడుకుకు బెయిల్ ఇప్పించిన లీగల్ టీంకు షారుఖ్ ఖాన్ బంగ్లా మన్నాత్ లో భారీ పార్టీ ఇచ్చాడు.