Begin typing your search above and press return to search.
మళ్లీ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ ఆఫీసుకు ఆర్యన్ ఖాన్
By: Tupaki Desk | 5 Nov 2021 9:32 AM GMTబాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ శుక్రవారం ఎన్సీబీ కార్యాలయంలో హాజరయ్యాడు. ముంబై క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ కేసులో పట్టుబడి దాదాపు 27 రోజులు జైల్లో ఉన్నాడు ఆర్యన్. ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యాడు. బెయిల్ నిబంధనల్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలలోపు హాజరుకావాల్సి ఉండడంతో ఆర్యన్ ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్నాడు.
కండీషన్ బెయిల్ నేపథ్యంలోనే ఆర్యన్ మరోసారి ఎన్సీబీ కార్యాలయానికి రావాల్సి వచ్చింది. ప్రతి శుక్రవారం ఎన్సీబీ ముందు హాజరు కావాలని ఆర్యన్ ఖాన్ కు షరతులు విధిస్తూ ముంబై హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అంతేకాకుండా ఉదయం 11 గంటల నుంచి 2 గంటల మధ్య హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆర్యన్ ఖాన్ ఈరోజు ఎన్సీబీ ఎదుట హాజరయ్యాడు.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పై విడుదలై ఊపిరి పీల్చుకున్నాడు. దాదాపు 27 రోజులకు పైగా అతడు డ్రగ్స్ కేసులో జైల్లో ఉన్నాడు. ముంబై క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ పార్టీలో పట్టుబడి ఎన్సీబీ ఆరోపణలో ఆర్యన్ కు బెయిల్ దక్కలేదు. సుప్రీంకోర్టు దిగ్గజ లాయర్ ముకుల్ రోహత్ గీ ఎట్టకేలకు బలమైన వాదన వినిపించి బెయిల్ ఇప్పించారు.
ఆర్యన్ ను విడిచిపెట్టడానికి ఎన్సీబీ అధికారుల తరుఫున మధ్యవర్తులు రూ.25 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల్లో వాస్తవాలను నిగ్గు తేల్చడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై ఇప్పుడు ఈ ఆరోపణలపైనే విచారణ జరుగుతోంది.